కడప హోమ్

గండికోట ఉత్సవాలలో ఏ రోజు ఏం జరుగుతుంది….?

#Gandikota

గత వైభవాన్ని, సంస్కృతి సంప్రదాయాలకు  దర్పణం పట్టే గండికోట ఉత్సవాలకు ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా, బంధు మిత్రులతో  తరలి రావాలని జిల్లా కలెక్టర్, టూరిజం కౌన్సిల్ చైర్మన్ డా.శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్ లోని విసి హాలులో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో గండికోట ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని, అందరూ భాగస్వామ్యం కావాలని ఆహ్వానం పలుకుతూ జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కడప జిల్లా చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా అత్యంత వైభవంగా కన్నుల పండుగ వాతావరణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గండికోట ఉత్సవాలు-2026 లను నిర్వహిస్తోంది. చారిత్రిక వైభవాన్ని చాటి చెప్పేలా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం గండికోట ఉత్సవాలు-2026 లను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.

జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా ఈ ఉత్సవాలను అత్యంత ప్రాధాన్యతతో జనవరి 11, 12, 13వ తేదీల్లో మూడు రోజులపాటు పండుగ వాతావరణంలో వైభవంగా నిర్వహిస్తున్నాం. ఈ ఉత్సవాలలో పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో వివిధ ప్రాంతాల నుండి వచ్చే పర్యాటకులు, సందర్శకులను విశేషంగా ఆకట్టుకునేలా అన్ని కార్యక్రమాలను రూపొందించాం.

మొదటి రోజు (11-01-2026) కార్యక్రమాలు :

సాయంత్రం 4:00 – 5:30 గం. వరకు           – శోభాయాత్ర

సాయంత్రం 5:30 గం.లకు                      – గండికోట ఉత్సవాలు-2026 ప్రారంభోత్సవం

సాయంత్రం 6:30 – 7:00 గం.వరకు            – గండికోట వారసత్వం, ఘన చరిత్ర…ప్రముఖ సినీ గీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గేయాలాపన, చరిత్రకారులు డా. సగిలి సుధారాణి, తవ్వ ఓబుల్‌రెడ్డి ప్రసంగం

రాత్రి 7:10 – 7.20 గం. వరకు                  – గండికోట థీమ్ డ్యాన్స్

రాత్రి 7:20 – 7:35 గం. వరకు                  – థిల్లానా కూచిపూడి నృత్యం

రాత్రి 7:35 – 7:55 గం. వరకు                  – ముషాయిరా కవి సమ్మేళనం

రాత్రి 7:55 – 8:15 గం. వరకు                  – సౌండ్ & లేజర్ లైట్ షో

రాత్రి 8:15 – 9:45 గం. వరకు                  – నేపథ్య గాయని మంగ్లీచే సంగీత కచేరీ

రాత్రి 9:45 – 10:00 గం. వరకు                – స్కై లాంతర్ ఫెస్టివల్

2వ రోజు (12-01-2026) కార్యక్రమాలు :

ఉదయం 10:00 – మ.2:00 గం.వరకు         – గైడెడ్ హెరిటేజ్ వాక్

అడ్వెంచర్ యాక్టివిటీస్                        – హెలిరైడ్, పారామోటార్ గ్లైడింగ్ మొదలైనవి.

గ్రామీణ క్రీడా కార్యక్రమాలు                      – వ్యాలీబాల్, టగ్ ఆఫ్ వార్, కబడ్డీ,కవిత్వం, కథలు చెప్పడం, ఫోటోగ్రఫీ, స్కెచింగ్, పెయింటింగ్, వి.లాగింగ్, వంటల పోటీలు.

సాయంత్రం 4:00 – 5:00 గం. వరకు           – కథా సదస్సు & గండికోట వైభవంపై డీకే, చదువుల బాబు, పి.బాలాజీ, తవ్వా ఓబుల్ రెడ్డి,  వై.మధుసూధన గారిచే ప్రసంగాలు.

సాయంత్రం 5:00 – 7:45 గం. వరకు           – సాంస్కృతిక కార్యక్రమాలు,కూచిపూడి, బుర్రకథ, హరికథ, మ్యాజిక్ షో, అన్నమయ్య సంకీర్తనలు, తోలుబొమ్మలాట మొదలైనవి.

రాత్రి 7:45 – 8:15 గం. వరకు                  – సౌండ్, లైట్ & లేజర్ షో

రాత్రి 8:15 – 9:45 గం. వరకు                  – రామ్ మిర్యాల చే మ్యూజికల్ నైట్ ప్రదర్శన

3వ రోజు (13-01-2026) కార్యక్రమాలు :

ఉదయం 10:00 – మ. 2:00 గం. వరకు       – అడ్వెంచర్ యాక్టివిటీస్ – హెలిరైడ్, పారామోటార్ గ్లైడింగ్., కవిత్వం, కథ చెప్పడం, ఫోటోగ్రఫీ, స్కెచింగ్, పెయింటింగ్, వి.లాగింగ్, వంటల పోటీలు

సాయంత్రం 4:00 – 7:00 గం. వరకు            – సాంస్కృతిక కార్యక్రమాలు, మిమిక్రి, జానపద గేయాలు, చెక్క భజన, క్లాసికల్ డాన్స్, యక్షగానం, బృందావనం

సాయంత్రం 7:00 గంటలకు                    – సౌండ్, లైట్ & లేజర్ షో

రాత్రి 7:20 – రాత్రి 9:00 గం. వరకు             – శివమణి చే మ్యూజికల్ నైట్ ప్రదర్శన

రాత్రి 9:00 గంటలకు                           – ఫైర్ వర్క్స్

రాత్రి 9:05 – 9:30 గం. వరకు                  – గండికోట ఉత్సవాల ముగింపు వేడుక

గండికోట ఉత్సవాల నిర్వహణలో భాగంగా పర్యాటకులకు, సందర్శకులకు మరింత వినోదాన్ని, ఆహ్లాదాన్ని అందించే విధంగా ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వివిధ రకాలైన సాంస్కృతిక, సాహిత్య, సంప్రదాయ, సాహస క్రీడా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది.

మూడు రోజుల ఉత్సవాల్లో భాగంగా.. దాదాపు 15 నిమిషాల నిదివితో 270° దృశ్య కోణంలో ఐమాక్స్ థియేటర్ కంటే అత్యంత అడ్వాన్స్ స్క్రీన్ అనుభూతితో గండికోట ఘన చరిత్రను తెలిపే లఘు చిత్రాన్ని వీక్షించేందుకు ఉచిత దృశ్యశ్రవణ ((audio visual) డోమ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. 11వ తేదీ ఉదయం 10 గంటల నుండి ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.

ప్రత్యేకించి యువతకు, చరిత్రకారులకు, కళాకారులు, చిత్రకారులు, సాహితీ ప్రియులు, కథకులు, రచయితలు, వాగ్గేయ కారులకు వారివారి అభిరుచులకు తగ్గట్టు చక్కటి కార్యక్రమాలను రూపకల్పన చేయడం జరిగింది.

అంతేకాకుండా సాంస్కృతిక, గ్రామీణ క్రీడలు,  సాహస (అడ్వెంచర్) క్రీడలు, గండికోట పెన్నా నదీ లోయలో బోటింగ్, రోప్ వే, కోట పరిసర ప్రాంతాల్లో ట్రెక్కింగ్ వంటి సదుపాయాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకోనున్నాయి.

సందర్శకులకు గండికోట ప్రకృతి అందాల వీక్షణంతో పాటు.. ఉత్సాహవంతులైన వారిని ఉత్సవాల్లో కూడా భాగస్వామ్యం చేస్తూ.. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, కథలు చెప్పడం, సంప్రదాయ క్రీడలు, సంప్రదాయ వంటరుచులు మొదలైన వివిధ రకాల పోటీలను కూడా నిర్వహించి చివరిరోజు బహుమతులను ప్రదానం చేయడం జరుగుతుంది.

గండికోట చారిత్రక సౌరభాలను, చుట్టుపక్కల ప్రకృతి అందాలను, పర్యాటక విశేషాలను 360° కోణంలో విహంగ వీక్షణం ద్వారా చూసేందుకు  హెలికాప్టర్ ద్వారా ఒక్కొక్కరికి రూ.3000 చొప్పున ఛార్జీలతో హెలీరైడ్ సదుపాయాన్ని కల్పించడం జరిగింది. వీటితోపాటు ఎయిర్ బెలూన్, పారాచూట్ విహంగ పయనం ద్వారా కోట పరిసరాలు, ఎర్రమల కొండల అందాలు, మంద్రంగా ప్రవహించే  పెన్నానదీ ప్రవాహం, మైలవరం, గండికోట రిజర్వాయర్ ల బ్యాక్ వాటర్ సోయగాలు, కొండలపై గాలి మరలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకోనున్నాయి.

మన కడప జిల్లాలో ప్రసిద్ధిగాంచిన గ్రామీణ చేతి వృత్తి కళాకారులు రూపొందించిన అనేక రకాలైన ఉత్పత్తులు, హ్యాండ్లూమ్స్, ఇలా అన్ని రకాలతో 25 సంప్రదాయ కళారూపాల ప్రదర్శన లతో పాటు గ్రామీణ రుచులతో 35 పిండి వంటల విక్రయ శాలలను కూడా ఏర్పాటు చేయడమైనది.

వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన వేదికలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఉత్సవాలకు వచ్చే సందర్శకులకు స్థానిక రుచులతో పాటు వివిధ రకాలైన సాంప్రదాయ రుచులను అందించే ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేయడం జరిగింది.

సందర్శకులు రాత్రిపూట బస చేసే సౌకర్యం కల్పిస్తూ.. వివిధ రకాల సదుపాయాలతో టెంట్ హౌస్ లను ఏర్పాటు చేయడమైనది. సందర్శకులకు ఎలాంటి కొరత లేకుండా అన్ని రకాలైన రక్షణా ఏర్పాట్లను పటిష్టంగా ఏర్పాటు చేయడమైనది.

సందర్శకులకు వసతిలో ఎలాంటి కొరత లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి నీరు, టెంపరెరీ టాయిలెట్స్, పారిశుద్ధ్యం,  రవాణా సదుపాయం, వెహికల్ పార్కింగ్.. ఇలా అన్ని రకాల కనీస మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగింది.

జిల్లా సాంస్కృతిక చారిత్రక పర్యాటక వైభవాన్ని గండికోట గ్రాండ్ కెనాన్ వైభవాన్ని ప్రపంచ స్థాయిలో ఆకర్షించేలా                              ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా కార్యక్రమాలను రూపొందించడం జరిగింది.

మొట్టమొదటిసారి ఇలాంటి పర్యాటక శోభను గండికోటలో నిర్వహించడం జరుగుతుంది. కడప జిల్లా వాసులకు ఇది ఒక చక్కటి అవకాశంగా భావించి.. ఉత్సవాలు నిర్వహించే మూడు రోజుల్లో అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సందర్శకులు విరివిగా తరలిరావాలని కోరడమైనది.

ఈ ఉత్సవాలకు గండికోట పరిసర ప్రాంతాల స్థానికులు,  రాష్ట్రేతర, జిల్లాయేతర పర్యాటకులు గండికోట ఉత్సవాలకు హాజరై.. మన వైఎస్ఆర్ కడప జిల్లా యంత్రాంగం తరఫున ఇస్తున్న ఆతిథ్యాన్ని స్వీకరించి విజయవంతం చేయాలని కోరుతున్నామని జిల్లా కలెక్టర్ కోరారు.

Related posts

నెహ్రూపై విషం చిమ్ముతున్న పాలక పార్టీ

Satyam News

సహజనటి జయసుధ “లక్ష్మణరేఖ” కు 50 సంవత్సరాలు

Satyam News

తల్లి కాబోతున్న కత్రినా కైఫ్

Satyam News

Leave a Comment

error: Content is protected !!