26.3 C
Hyderabad
September 27, 2026
సినిమాహోమ్

దురంధర్ 2 కోసం ఎదురుచూపు…. కధ ఏమిటంటే…

బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ తీపి కబురు అందించారు.

ఈ సినిమా రెండవ భాగం ‘ధురంధర్: ది రివెంజ్’ ప్రపంచవ్యాప్తంగా 2026, మార్చి 19న విడుదల కానుంది.తొలి భాగం కేవలం హిందీలో విడుదలై భారత్‌లో 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి లభించిన అఖండ స్పందనను దృష్టిలో ఉంచుకుని, రెండవ భాగాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు.

ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. మొదటి భాగం ముగింపులో కనిపించిన కీలక సన్నివేశాలకు కొనసాగింపుగా సెకండ్ పార్ట్ ఉండబోతోంది. పాకిస్థాన్‌లో భారత గూఢచారిగా హమ్జా (రణ్‌వీర్ సింగ్) చేసే పోరాటం, అక్కడి ఉగ్రవాద మూలాలను ఎలా అంతం చేస్తారనేది ఈ సీక్వెల్‌లో ప్రధానంగా చూపించనున్నారు.

పాకిస్థాన్ పై ఇటీవల జరిపిన ఆపరేషన్ సిందూర్ వివరాలు పొందుపరచినట్లు చెబుతున్నారు.ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నాన్-థియేట్రికల్ హక్కులు (డిజిటల్ మరియు శాటిలైట్) భారీ ధరకు అమ్ముడై సరికొత్త రికార్డులను సృష్టించాయి. మార్చి 19న ఉగాది పర్వదినం సందర్భంగా ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.

Related posts

అద్భుతమైన నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీ

Satyam News

బందర్‌ పోర్టుపై వైసీపీ క్రెడిట్‌ చోరీ…. అసలు నిజం ఇది!

Satyam News

ఉయ్యూరులో వైభవంగా శ్రీనివాస కళ్యాణం

Satyam News

దేవదేవుడికి అపచారం చేశాం: రోజా, జోగి టాక్ లీక్

Satyam News

ఈడీ చేతిలో మద్యం కుంభకోణం కీలక ఆధారాలు

Satyam News

అమరావతి నిర్మాణంలో వైజాగ్‌ స్టీల్‌…. కూటమి ప్రభుత్వం ఉక్కు మద్దతు..!!

Satyam News

Leave a Comment