ప్రత్యేకంహోమ్

ఈడీ చేతిలో మద్యం కుంభకోణం కీలక ఆధారాలు

#PeddireddyMithunReddy

జగన్ రెడ్డి హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్రధారిగా ఆరోపణలు ఉన్న రాజంపేట ఎంపి, వైసీపీ ముఖ్యనాయకుడు, జగన్ రెడ్డి సన్నిహితుడు అయిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నిర్వహించిన విచారణ ముగిసింది.

దాదాపు ఏడు గంటల పాటు ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించారు. విచారణలో వచ్చిన అంశాలు నేరుగా వెల్లడి కాకపోయినా మిథున్ రెడ్డి నుంచి ఆధారాలతో సహా కీలక అంశాలను సేకరించినట్లుగా చెబుతున్నారు. ఏపీ లిక్కర్స్ స్కామ్‌కు సంబంధించిన అంశాలపై కోర్టు ఉత్తర్వులు ఉన్నందున తానేమీ మాట్లాడలేనని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు.

మిథున్ రెడ్డి కంపెనీలకు చెందిన ఎకౌంట్లు తదితర విషయాలను కూడా ఈడీ విచారించినట్లు తెలిసింది. వాటికి సంబంధించిన ఆర్ధిక లావాదేవీలు కూడా ఈడీ పరిశీలనలో ఉన్నాయి. పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు నుంచి విదేశాలకు డబ్బులు తరలిపోవడం లాంటి అంశాలు కూడా ఈ కేసులో ఉన్నాయి.

జగన్ రెడ్డి హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తు వేగంగా జరిపింది. ఎంతో మందిని అరెస్టు చేశారు. వారిలో చాలా మంది ఇప్పటికీ జైల్ లోనే ఉండగా కొందరు బయటకు వచ్చారు. మిథున్ రెడ్డి తో విచారణ సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు కీలక వివరాలు సేకరించినట్లు సమాచారం.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన మద్యం అమ్మకాల్లో అవకతవకలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు కీలక నేతలను విచారించారు. ఈ కుంభకోణంలో ఎవరెవరి హస్తం ఉంది? నిధుల మళ్లింపు ఎలా జరిగింది? అనే కోణంలో ఆధారాలు సేకరిస్తున్నారు.

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని గురువారం ఈడీ సుదీర్ఘంగా విచారణ జరిపింది. ఈ విచారణలో ఆయన చెప్పిన అంశాలను ఆధారంగా చేసుకుని ఈడీ అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేస్తున్నారు.

Related posts

మూడు ముక్కలైన కేసీఆర్ పార్టీ

Satyam News

వైభవంగా ప్రారంభమైన శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

Satyam News

సినీ నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న దళపతి విజయ్

Satyam News

సనత్ నగర్‌లో రావణ దహనంలో పాల్గొన్న తలసాని

Satyam News

టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్

Satyam News

జీ5లో రొమాంటిక్ డ్రామా ‘బ్యాండ్ మేళం’ 24 నుంచి స్ట్రీమింగ్

Satyam News

Leave a Comment