నిజామాబాద్హోమ్

సర్పంచ్ ఎన్నికల్లో దొంగ నోట్ల పంపిణీ?

#Cash

నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని వర్ని మండలంలో నకిలీ నోట్ల వ్యవహారం కలకలం సృష్టించింది. జలాల్‌పూర్ గ్రామానికి చెందిన శాయిలు అనే రైతు తన పంట రుణాన్ని చెల్లించడానికి కెనరా బ్యాంక్ శాఖకు వెళ్లగా ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

సుమారు 2.08 లక్షల రూపాయల విలువైన 500 నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసే క్రమంలో, అవి నకిలీవని గుర్తించిన క్యాషియర్ పోలీసులకు సమాచారం అందించారు.పోలీసుల విచారణలో శాయిలు ఆ డబ్బును తన కుమారుడు ఇచ్చాడని తెలిపారు.

అయితే, ఇటీవలి సర్పంచ్ ఎన్నికల సమయంలో ఓ అభ్యర్థి ఈ నకిలీ నోట్లను పంపిణీ చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ముఖ్యంగా, ఒక జాతీయ పార్టీ మద్దతుతో గెలిచిన అభ్యర్థికి సంబంధించిన అనుచరుల ద్వారా ఈ నగదు చలామణిలోకి వచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

సదరు అభ్యర్థి రాజకీయంగా కీలక నేత అయిన పి.శ్రీనివాస్ రెడ్డికి సన్నిహితుడని ప్రచారం జరుగుతుండటంతో, ఈ కేసును త్రొక్కిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఈ నకిలీ నోట్ల మూలాలపై లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.

Related posts

బకాయిల కోసం ఎదురు చూసి కన్నుమూసిన రిటైర్డ్ ఎస్సై

Satyam News

పాత మంగళగిరి హిందూ శ్మశానవాటికకు సరికొత్త రూపు

Satyam News

బీ ఆర్ ఎస్ పై ప్రజల విశ్వాసానికి గుర్తు ఇది

Satyam News

ప్రపంచ సినిమా పండుగలో వంతుకు అవార్డులు

Satyam News

ప్రభుత్వ ఖర్చులతో స్వదేశానికి చేరిన గల్ఫ్ కార్మికుని మృతదేహం

Satyam News

నిరుద్యోలను మోసం చేసిన కాంగ్రెస్

Satyam News

Leave a Comment