హైదరాబాద్హోమ్

అటవీ రెవెన్యూ భూ సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం

#Ponguleti

రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో అటవీ భూములకు సంబంధించి రెవెన్యూ, అటవీ శాఖల మధ్య కొన్నేళ్లుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.

రెవెన్యూ, అటవీ శాఖల మధ్య ఉన్న భూ సరిహద్దు వివాదాలతో పాటు, పట్టా భూములకు సంబంధించి అటవీ శాఖతో నెలకొన్న వివాదాలను కూడా గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం రెండు శాఖల అధికారులు సంయుక్తంగా జాయింట్ రీ సర్వే నిర్వహించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో భూముల వాస్తవ పరిస్థితులను పరిశీలించి, రికార్డులు, మ్యాపులు, సర్వే వివరాలను సమగ్రంగా సరిపోల్చి వివాదాలకు తావులేకుండా స్పష్టమైన హద్దులను నిర్ధారించాలన్నారు.

ఈ సమస్యలను ఒక శాఖపై మరొక శాఖ బాధ్యతగా నెట్టివేసే ధోరణి విడనాడాలని, పరస్పర సమన్వయంతో పరిష్కార దిశగా అడుగులు వేయాలని మంత్రి స్పష్టం చేశారు. గ్రామస్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్రస్థాయి వరకు రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు నిరంతరం సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిష్కరించగలిగే సమస్యలను అక్కడే పరిష్కరించాలని, ఉన్నతస్థాయి నిర్ణయాలు అవసరమైన అంశాలను వెంటనే రాష్ట్రస్థాయికి నివేదించాలన్నారు.

భూ సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులే వాటిని మరింత జఠిలం చేసే పరిస్థితి ఉండకూడదు. ఏళ్ల తరబడి వివాదాలు కొనసాగడం వల్ల రైతులు, భూయజమానులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు న్యాయం జరిగేలా పారదర్శకంగా, వాస్తవ ఆధారాలతో సమస్యలను పరిష్కరించాలి. ఈ ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా నిర్ణీత కార్యాచరణతో ముందుకు వెళ్లాలని మంత్రి సూచించారు.

ఇకపై రెవెన్యూ–అటవీ భూ సరిహద్దు వివాదాల పరిష్కార ప్రక్రియను తాను స్వయంగా పర్యవేక్షిస్తానని మంత్రి స్పష్టం చేశారు. రెండు శాఖల మధ్య సమన్వయానికి అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తానన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే సంకల్పంతో ముందుకు సాగుతోందని మంత్రి పేర్కొన్నారు. భూ వివాదాలు లేని తెలంగాణ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు భూమిపై హక్కులు, భద్రత కల్పించే దిశగా ప్రతి శాఖ బాధ్యతాయుతంగా పనిచేయాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

Related posts

5వ పోలీస్ క్రీడల్లో తెలంగాణ పోలీస్ అకాడమీ విజయదుందుభి

Satyam News

ఆర్టీజీఎస్‌తో  2,259 అంబులెన్సుల అనుసంధానం

Satyam News

రిలయన్స్ వారసుడు.. ఆంధ్ర దత్త పుత్రుడు.. అనంత్ అంబానీ!

Satyam News

ఇవన్నీ నాఇళ్లే…. నీ దారి చూసుకో….. షర్మిలకి జగన్‌ అల్టిమేటమ్‌!

Satyam News

సిగ్గుండాలి జగన్‌..ఎంపీ భరత్ మాస్ కౌంటర్

Satyam News

కాక్రోచ్ వీడియోలను వైరల్ చేసింది పాకిస్తాన్?

Satyam News

Leave a Comment