గుంటూరుహోమ్

పేరుకే ఆసుపత్రి… వైద్యుడు ఉండడు

కోట్ల రూపాయల నిధులతో నిర్మాణమైన ఎంటీఎంసీ పరిధిలోని కుంచనపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అలంకారప్రాయంగా మారింది. ఏ జబ్బు చేసిన ఆసుపత్రికి వెళ్లి వైద్యుడికి చూపించుకొని తమ రోగాలను నయం చేసుకుందామని ఎదురుచూస్తున్న సామాన్య ప్రజలకు చుక్కెరవుతుంది.

వైద్యుడి గదిలో ఖాళీ కుర్చీ దర్శనమిస్తుంది. ఉదయాన్నే ఆసుపత్రి తెరచిన, వైద్యుడు మాత్రం ఆసుపత్రి వైపు కన్నెత్తి చూడడు. కాళ్లకు గాయమై కట్టు కట్టించుకుందామనుకున్నా అక్కడ కట్టు గుడ్డలు కానీ ( కాటన్ క్లాత్ ), వైద్య పరికరాలు అన్ని అందుబాటులో లేవని అక్కడ పనిచేసే సిబ్బంది చెబుతున్నారు.

ఓన్లీ బీపీ చెక్ అప్ చేసేందుకు, మందులు ఇచ్చేందుకు, పేరుకే ల్యాబ్ టెక్నీషియన్ కానీ, వైద్య పరీక్షలు ఏవి? అక్కడ చేయడం లేదు. అర్బన్ ప్రైమరీ సెంటర్లో నిత్యం రోగులను చూసేందుకు ఉండాల్సిన వైద్యుడు ఆసుపత్రికి రాడు. అదేమని అక్కడ సిబ్బందిని ప్రశ్నిస్తే డాక్టర్ గారు వేరే డ్యూటీ మీద వెళ్లారు వారం దాకా ఆయన సెలవులో ఉన్నారు అనే సమాధానమే వినిపిస్తుంది.

ప్రజాధనం వెచ్చించి ఆసుపత్రి నిర్మాణం జరుపుకున్న రోగులకు సరైన వైద్యం అందడం లేదని, అన్ని సదుపాయాలు ఆసుపత్రిలో లేవని పలువురు స్థానిక ప్రజలు, రోగులు పెదవిరుస్తున్నారు. వైద్యం చేయాల్సిన డాక్టరు వేరే డ్యూటీ అంటూ సెలవు పెడితే.. మరి కుంచనపల్లి లో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో వచ్చే రోగులను పట్టించుకునే నాధుడే డి? ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా వైద్యం చేయించు కునేందుకు వచ్చిన ప్రజలకు సరైన వైద్యం అందక, ప్రైవేటు ఆసుపత్రులలో చూపించుకునేందుకు డబ్బులు లేక ఇబ్బందులు పడే పరిస్థితి దాపురిస్తుంది.

ఆసుపత్రి నిర్మాణం చేపట్టిన దగ్గర నుండి ఇప్పటివరకు వైద్య పరికరాలు లేవని, సరైన వైద్యం అందడం లేదని గ్రామస్తులు, ఇతర గ్రామాల వాళ్లు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కుంచనపల్లిలో ఉన్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పూర్తిస్థాయిలో వైద్య పరికరాలు సమకూర్చి, వైద్యుడిని పర్మినట్టుగా నియమిస్తే, అనారోగ్యం బారిన పడిన ప్రజలు వైద్యం చేయించుకునేందుకు వెసులుబాటుగా ఉంటుంది.

Related posts

కుటుంబ వివాదాలతో జగన్‌ పొలిటికల్ ఇమేజ్ డ్యామేజ్….!!

Satyam News

రాలిపోయిన ధృవతార: ఆశా భోంస్లే ఇక లేరు

Satyam News

చేనేత గర్జనతో మార్మోగిన మంగళగిరి

Satyam News

దళితవాడల్లో టీటీడీ ఆలయాలు

Satyam News

#GoodNews: హోర్మోజ్ జల సంధి దాటిన భారత్ ఎల్పీజీ నౌక

Satyam News

ఈ అవకాశాన్ని పరిశ్రమ అభివృద్ధికి ఉపయోగిస్తా

Satyam News

Leave a Comment