26.6 C
Hyderabad
September 16, 2026
ముఖ్యంశాలుహోమ్

చదువులో రాణించలేని విద్యార్థులు క్రీడల్లో పోటీ పడాలి

వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో రూ.1.77 కోట్ల (సీ ఎస్ ఆర్ నిధులతో)వ్యయంతో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల భవనాన్ని విద్యార్థుల ఆనందోత్సాహాల మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు.

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల్ల చిన్నారెడ్డి స్థానిక శాసన సభ్యులు జి. మధుసూదన్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలిసి పాఠశాలతో పాటు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

రూ.1.45 కోట్ల వ్యయంతో, 4,500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు కురుమూర్తి రాయ లిఫ్ట్ ఇరిగేషన్, రూ.92 లక్షల వ్యయంతో 3,100 ఎకరాలకు సాగునీరు అందించే నెల్విడి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్వహణ పనులకు శంకుస్థాపన చేశారు. దాంతో పాటుగా రూ.1.94 కోట్ల వ్యయంతో 4,200 ఎకరాలకు సాగునీరు అందించే సరళ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్వహణ పనులకు శంకుస్థాపనలు చేశారు.

అనంతరం పాఠశాల తరగతి గదిని సందర్శించిన ముఖ్యమంత్రి విద్యార్థులతో ముచ్చటించి శుభాకాంక్షలు తెలియజేశారు. చదువులో రాణించలేని విద్యార్థులు క్రీడల్లో పోటీ పడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. వనపర్తి ప్రభుత్వ పాఠశాలలో చదివి తాను సీఎం అయ్యానని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నానని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు అందరూ బాగా చదువుకొని డాక్టర్లు, శాస్త్రవేత్తలు, సహా వివిధ రంగాల్లో స్థిరపడి తెలంగాణ పునర్నిర్మాణానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.

గతంలో వనపర్తి ఎమ్మెల్యేగా డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి పోటీ చేసినప్పుడు ఆయన కోసం తాను గోడలపై రాసీ ప్రచారం చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ సునీతా రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్లా రాజేష్ రెడ్డి, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, ఇతర కార్పొరేషన్ల చైర్మన్లు సరితా తిరుపతయ్య, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, కొత్తకోట మునిసిపల్ వైస్ ఛైర్పర్సన్ పల్లవి సునీతా పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

బాలికల గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ

Satyam News

హంద్రీ–నీవా సుజల స్రవంతి (HNSS) ఫేజ్–IIకు నిధులు

Satyam News

తల్లిపై కన్నేసి కొడుకును కిడ్నాప్ చేసిన లవర్

Satyam News

నారా లోకేష్‌కు మోదీ ‘సూపర్ ప్రశంస’!

Satyam News

ప్రధాని మోడీతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ

Satyam News

ముఖ్యమంత్రే విద్యాశాఖ మంత్రి కావడం మన ఖర్మ

Satyam News

Leave a Comment