ముఖ్యంశాలుహోమ్

ప్రత్యర్థుల గుండెల మీదకు ఇక ప్రళయ్ క్షిపణి

#Pralay

ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టించేలా ప్రళయ్ క్షిపణులను భారత్ విజయవంతంగా పరీక్షించింది. బుధవారం ఒడిశా తీరానికి సమీపంలో రెండు ప్రళయ్ క్షిపణులను తక్కువ వ్యవధిలో విజయవంతంగా పరీక్షాత్మకంగా భారత్ ప్రయోగించింది. ప్రళయ్ క్షిపణి స్వదేశీంగా అభివృద్ధి చేసిన క్వాసీ-బాలిస్టిక్ మిస్సైల్. కాగా, అత్యంత ఖచ్చితత్వం కోసం ఆధునిక నావిగేషన్ వ్యవస్థను కలిగి ఉంది.

ఈ క్షిపణి వివిధ లక్ష్యాలపై దాడి చేయడానికి అనువుగా విభిన్న రకాల వార్‌హెడ్లను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంది. ఈ పరీక్షా ప్రయోగాలను రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) నిర్వహించింది. “ఈ ఫ్లైట్‌ టెస్ట్‌ను వినియోగదారుల మూల్యాంకన పరీక్షలలో భాగంగా నిర్వహించాం. రెండు క్షిపణులూ నిర్దేశిత మార్గాన్ని అనుసరిస్తూ, అన్ని లక్ష్యాలను విజయవంతంగా సాధించాయి. ట్రాకింగ్ సెన్సర్లు దీనిని ధృవీకరించాయి,” అని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

Related posts

టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ రాజీనామా?

Satyam News

జాతీయ రహదారిపై ‘మాఫియా’ మారణహోమం!

Satyam News

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టుల పరిశీలన

Satyam News

ట్రంప్‌ను నిలదీయడంలో మోదీ మౌనం ఎందుకు?

Satyam News

సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని చనిపోయిన డీజీపీ

Satyam News

తల్లిపై కన్నేసి కొడుకును కిడ్నాప్ చేసిన లవర్

Satyam News

Leave a Comment