ఆదిలాబాద్హోమ్

గోడు వెళ్లబోసుకున్న ఆడబిడ్డలను కాపాడే బాధ్యత మాది

#MalluBhattiVikramarka

బోత్ నియోజకవర్గంలోని పిప్రి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన ప్రగతి బాట కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడారు. రాష్ట్రానికి మానవీయ కోణం ఉంది అంతరాలు లేని సమాజం నిర్మాణమే మా లక్ష్యం అని ఆయన స్పష్టం చేశారు.

ఈ రాష్ట్రంలో పుట్టడం మా అదృష్టం అన్న రీతిలో పరిపాలన సాగుతుంది, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం. పిప్రిలో బహిరంగ సభ నా ఆలోచన కాదు ముఖ్యమంత్రి ఆలోచన అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ప్రజా పాలన  ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలకు సంబంధించి చర్చిస్తున్న క్రమంలో ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అధికారుల ద్వారా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యక్రమంలో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహిద్దామని సీఎం అన్నారు.

పిప్పిరి నుంచి ఖమ్మం వరకు మీరు నడుస్తూ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ఉంటారు ప్రజలు చెప్పిన అనేక సమస్యలు విని ఉంటారు వాటిని వెంటనే సాంక్షన్ చేసి అమలు చేయాల్సిన బాధ్యత మనపై ఉందని, పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మీరు ఇచ్చిన హామీలు అన్ని అమలు చేసి నిజం చేద్దాం, అదే నిజమైన ప్రజా పాలనాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు.

ఈ భారీ బహిరంగ సభకు సీఎం గారే కారణం. మండుటెండల్లో ఆనాడు నాతో నడిచి పాదయాత్రను విజయవంతం చేశారు ఈరోజు 1238 కోట్ల విలువైన పనులు అన్నిటికీ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు అని డిప్యూటీ సీఎం తెలిపారు.

ఇది ఒక రాజకీయ సభ కాదు ఆనాడు నేను ప్రజలతో ఏర్పరచుకున్న అనుబంధం ఈ సభ అని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు శంకుస్థాపన చేసుకునే కార్యక్రమం ఇది అని డిప్యూటీ సీఎం అన్నారు.

అధికారంలోకి రావడానికి రాజకీయ పార్టీలు అనేక హామీలు ఇస్తాయి కానీ అధికారంలోకి రాగానే మర్చిపోతాయి, కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం లోని యావత్ క్యాబినెట్ మేం పాలకులం కాదు సేవకులు అని ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నామని తెలిపారు.

అధికారం అంటే హోదా అని అధికారం అంటే పెత్తనం చేయడమే అనే ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి కి గాని డిప్యూటీ సీఎం గా నాకు కానీ మా క్యాబినెట్ సభ్యుల ఎవరికి ఆ ఆలోచన లేదు అన్నారు. అందుకే అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల కాలంలోనే 99% హామీలు అమలు చేసిన గొప్ప ప్రభుత్వం మాది అన్నారు.

ఈ ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతంలో నడుస్తున్నప్పుడు ఇల్లు లేదని 10 సంవత్సరాలుగా ఇల్లు కోసం గోడు వెళ్ళబోసుకుంటున్నామని అనేకమంది ఎన్నికల ముందు ఆవేదన వ్యక్తం చేశారు ఓవైపు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి సీఎల్పీ నేతగా నేను పాదయాత్ర చేశా ము. ఆనాడు మాతో గోడు వెళ్ళబోసుకున్న ఆడబిడ్డల మాటలను దృష్టిలో పెట్టుకొని అధికారంలోకి రాగానే 22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించాం ఒక్కో ఇంటిని 5 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నాం. నియోజకవర్గానికి 3500 చొప్పున రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇళ్లను మంజూరు చేసి నిర్మాణాలు ప్రారంభించి చిత్తశుద్ధిని చాటుకున్న ప్రభుత్వం తమది అని డిప్యూటీ సీఎం తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వానికి మానవీయ కోణం ఉంది అంతరాలు లేని సమాజం నిర్మించాలన్న ఆలోచనతో ప్రపంచంతో మన బిడ్డలు పోటీపడేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేశారు. ఒక్కో పాఠశాలను 200 కోట్లతో 25 ఎకరాల్లో నిర్మిస్తున్నారు దేశంలోని ఏ రాష్ట్రంలో ఈ తరహా పాఠశాలలు లేవు .

అన్ని వర్గాల పిల్లలను ఒకే దగ్గర చదివిస్తూ వసుదైక కుటుంబం గా రాష్ట్రం ఎదగాలన్నదే సీఎం ఆలోచన అని తెలిపారు. ఈరోజు ఒక్కరోజే మూడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు శంకుస్థాపన చేసినట్టు తెలిపారు. ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో బిడ్డలు పాఠశాలకు వెళ్లాలంటే అర్ధాకలితో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు తలకెక్కని పరిస్థితి, రాష్ట్రంలోని ఏ బిడ్డ కాలేకడుపుతో బడికి వెళ్ళవద్దని భావించిన సీఎం ప్రతిబిడ్డ బడికి రాగానే ఉదయం అల్పాహారంతో పాటు రాగి జావా లేదంటే పాలు ఇవ్వాలని నిర్ణయించాం అని తెలిపారు.

Related posts

ఎసిబి వలలో వనపర్తి జిల్లా సివిల్ సప్లయి డి.ఎం

Satyam News

“తల తిరుగుడు” కు అత్యాధునిక వైద్య చికిత్సలు

Satyam News

ముంబైని ముంచేసిన భారీ వర్షం

Satyam News

ఉత్తరప్రదేశ్ లో వర్ష భీభత్సం: 50 మంది మృతి

Satyam News

బాల్య వివాహాలను నిరోధించడం మన బాధ్యత

Satyam News

ఐపీఎస్‌ అధికారిపై వరకట్న వేధింపుల కేసు

Satyam News

Leave a Comment