ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు, అప్పటి జగన్ ప్రభుత్వ దళిత వ్యతిరేక వైఖరికి నిదర్శనం. తన వద్ద నమ్మకంగా పనిచేసిన దళిత యువకుడిని MLC అనంతబాబు కిరాతకంగా చంపి, డెడ్‌బాడీని డోర్ డెలివరీ చేసినా..అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత పార్టీ నేతను కాపాడటానికే మొగ్గు చూపారు. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా దళిత వర్గాల్లో ఆగ్రహానికి కారణమైంది.
హత్య జరిగిన సమయంలో ఆధారాలు స్పష్టంగా ఉన్నప్పటికీ, అనంతబాబును అరెస్ట్ చేయడానికి పోలీసులు రోజుల తరబడి వెనకడుగు వేయడం వెనుక తాడేపల్లి ప్యాలెస్ ఒత్తిడి ఉందనేది బహిరంగ రహస్యం. సాక్షాత్తు ఓ దళిత బిడ్డ ప్రాణం పోతే, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి..కేసును నీరుగార్చేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నించింది. ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వం అనంతబాబుకు రాజకీయ అండదండలు అందించి, దళితుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిందనే విమర్శలు బలంగా వినిపించాయి.
అనంతబాబును కాపాడే క్రమంలో బాధితుడి కుటుంబానికి కనీస న్యాయం జరగకుండా అప్పటి ప్రభుత్వం అడ్డుపడిందని దళిత సంఘాలు మండిపడుతున్నాయి. నిందితుడికి బెయిల్ వచ్చేలా సహకరించడం, కేసును తప్పుదోవ పట్టించేలా సాక్షులను ప్రభావితం చేయడం వంటి అంశాల్లో ప్రభుత్వం నేరుగా ప్రమేయం కలిగి ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దళితులకు అండగా ఉంటామని చెప్పే జగన్, తన అనుచరుడైన అనంతబాబు కోసం బాధితుల పక్షాన నిలబడకుండా ద్రోహం చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ఈ కేసులో అనంతబాబు మళ్ళీ అరెస్టు కావడంతో పాత పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. గతంలో అధికార బలం చూసుకుని విర్రవీగిన అనంతబాబుకు, అండగా నిలిచిన జగన్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని విమర్శలు వినిపిస్తున్నాయి. అనంతబాబు కోసం దళితులకు జగన్ అన్యాయం.!
ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు, అప్పటి జగన్ ప్రభుత్వ దళిత వ్యతిరేక వైఖరికి నిదర్శనం. తన వద్ద నమ్మకంగా పనిచేసిన దళిత యువకుడిని MLC అనంతబాబు కిరాతకంగా చంపి, డెడ్‌బాడీని డోర్ డెలివరీ చేసినా..అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత పార్టీ నేతను కాపాడటానికే మొగ్గు చూపారు. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా దళిత వర్గాల్లో ఆగ్రహానికి కారణమైంది.
హత్య జరిగిన సమయంలో ఆధారాలు స్పష్టంగా ఉన్నప్పటికీ, అనంతబాబును అరెస్ట్ చేయడానికి పోలీసులు రోజుల తరబడి వెనకడుగు వేయడం వెనుక తాడేపల్లి ప్యాలెస్ ఒత్తిడి ఉందనేది బహిరంగ రహస్యం. సాక్షాత్తు ఓ దళిత బిడ్డ ప్రాణం పోతే, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి..కేసును నీరుగార్చేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నించింది. ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వం అనంతబాబుకు రాజకీయ అండదండలు అందించి, దళితుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిందనే విమర్శలు బలంగా వినిపించాయి.
అనంతబాబును కాపాడే క్రమంలో బాధితుడి కుటుంబానికి కనీస న్యాయం జరగకుండా అప్పటి ప్రభుత్వం అడ్డుపడిందని దళిత సంఘాలు మండిపడుతున్నాయి. నిందితుడికి బెయిల్ వచ్చేలా సహకరించడం, కేసును తప్పుదోవ పట్టించేలా సాక్షులను ప్రభావితం చేయడం వంటి అంశాల్లో ప్రభుత్వం నేరుగా ప్రమేయం కలిగి ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దళితులకు అండగా ఉంటామని చెప్పే జగన్, తన అనుచరుడైన అనంతబాబు కోసం బాధితుల పక్షాన నిలబడకుండా ద్రోహం చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ కేసులో అనంతబాబు మళ్ళీ అరెస్టు కావడంతో పాత పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. గతంలో అధికార బలం చూసుకుని విర్రవీగిన అనంతబాబుకు, అండగా నిలిచిన జగన్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని విమర్శలు వినిపిస్తున్నాయి. సుబ్రహ్మణ్యం మృతికి కారకుడైన వ్యక్తిని వెనకేసుకొచ్చిన తీరు, వైసీపీ ప్రభుత్వ పతనానికి ఒక ప్రధాన కారణమైందని, దళిత వర్గాలు ఈ అన్యాయాన్ని ఎన్నటికీ మర్చిపోలేవని స్పష్టమవుతోంది.సుబ్రహ్మణ్యం మృతికి కారకుడైన వ్యక్తిని వెనకేసుకొచ్చిన తీరు, జగన్ ప్రభుత్వ పతనానికి ఒక ప్రధాన కారణమైందని, దళిత వర్గాలు ఈ అన్యాయాన్ని ఎన్నటికీ మర్చిపోలేవని స్పష్టమవుతోంది.