ప్రత్యేకంహోమ్

స్థానిక సమరంలో కేడర్‌ని బలి చేసి చేతులెత్తేసిన జగన్‌!

#Jagan

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులను తప్పనిసరిగా నిలబెట్టాలని పార్టీ అధినేత జగన్‌ చాలా సీరియస్‌గా చెప్పారు. ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే ఆ నియోజకవర్గ ఇంఛార్జ్‌లకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది లేదని బెదిరించారు. పార్టీ నాయకుల మీద అంత ఒత్తిడి తీసుకొచ్చారు గానీ.. జగన్‌తో పాటు ఆయన కోటరీలో కీలకమైన ముఖ్య నాయకుల నియోజకవర్గాల్లోనే ఎక్కువగా నామినేషన్లు పడలేదు. ఏకగ్రీవాలు కూడా కోటరీ కోటల్లోనే ఎక్కువగా జరిగాయి.

జగన్‌ సొంతగడ్డ పులివెందుల మున్సిపాలిటీలోని 40 వార్డుల్లో 19 చోట్ల వైసీపీ నామినేషన్లే వేయలేదు. జగన్‌ మేనమామ రవీంద్రనాధ్‌రెడ్డి ఇంఛార్జ్‌గా ఉన్న కమలాపురంలో ఛైర్మన్‌తో పాటు మొత్తం 23 కౌన్సిలర్ స్థానాలకు వైసీపీ నుంచి నామినేషన్లు పడలేదు. పార్టీలో జగన్‌ తర్వాత స్థానంలో ఉండే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోట అని చెప్పుకొనే పుంగనూరులో వైసీపీ పోటీ నుంచి తప్పుకొంది.

కమలాపురం, పుంగనూరుతో పాటు ఎర్రగుంట్ల, మైదుకూరు, రాయచోటి, గుత్తి, దర్శి, గురజాల, పిడుగురాళ్లలో మున్సిపల్‌ ఛైర్మన్ స్థానాలకు వైసీపీ నామినేషన్లు  వేయలేదు. దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, గురజాల ఇంఛార్జ్‌ కాసు మహేశ్‌రెడ్డి జగన్‌కి అత్యంత విశ్వాసపాత్రులు, సన్నిహితులు అని అందరికీ తెలుసు. ఈ ప్రాంతాలు వైసీపీకి పెట్టని కోటలని ఆ పార్టీ నాయకులు చెప్పుకొంటూ ఉంటారు.

రాష్ట్రంలో కూటమి పార్టీలు అత్యంత బలంగా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, విజయవాడ, గుంటూరు, నెల్లూరు వంటి ప్రాంతాల్లో వైసీపీ నాయకులు కార్పొరేషన్ల మేయర్ స్థానాలు, మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ పోస్టులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నామినేషన్లు వేశారు. ఎలాగూ ఓడితామని తెలిసినా పార్టీ అధిష్టానం ఒత్తిడితో అయిష్టంగానే ఎన్నికల బరిలోకి దిగారు. తమను ఎన్నికల యుద్ధంలోకి తోసేసి.. జగన్‌తో పాటు వైసీపీ కీలక నాయకులంతా తమ సొంత ప్రాంతాల్లో కనీసం నామినేషన్లు కూడా వేయకుండా చేతులెత్తేయడం చూసి రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నాయకులు షాక్‌ అవుతున్నారు. ఇప్పుడు జగన్‌తో సహా ముఖ్య నేతలంతా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరా అని సొంత పార్టీ నేతల నుంచే ప్రశ్నలు వస్తున్నాయి.

Related posts

‘గోదావరి పుష్కరాలు – 2027’ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం

Satyam News

చైనా సరిహద్దు వద్ద భద్రత పెంచిన భారత్

Satyam News

మూసీ పునరుజ్జీవం పేరుతో రేవంత్ మోసం

Satyam News

చేనేతకు ‘అసెంబ్లీ’ ఆదరణ

Satyam News

అనంతపురం యాపిల్స్‌.. . షిమ్లాకి పోటీగా సీమ రేగిపండ్లు

Satyam News

ట్రంప్ మూర్ఖత్వం వల్ల ఎంత నష్టం? ఎంత కష్టం?

Satyam News

Leave a Comment