హైదరాబాద్హోమ్

ఫేక్ కథనంపై డెక్కన్ క్రానికల్‌కు కేటీఆర్ పరువు నష్టం నోటీసులు

#KTR

తెలంగాణ శాసనసభ సభ్యుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్), డెక్కన్ క్రానికల్ దినపత్రిక యాజమాన్యానికి పరువు నష్టం నోటీసు జారీ చేశారు. జూలై 8, 2026న ఫ్రంట్ పేజీలో ప్రచురితమైన “KTR’s ‘Landlord’ Builds Tower in Hussainsagar” అనే కథనం తన ప్రతిష్ఠను దిగజార్చేలా ఉద్దేశపూర్వకంగా రాసినదని ఆయన తన న్యాయవాద బృందం పీవీ జనని అండ్ అసోసియేట్స్ ద్వారా పంపిన నోటీసులో స్పష్టం చేశారు. ఈ నోటీసును డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ కి పంపడం జరిగింది.

హుస్సేన్‌సాగర్ సమీపంలో ఒక ప్రైవేట్ డెవలపర్‌కు ఇచ్చిన భవన అనుమతులను జన్వాడలోని ఫామ్‌హౌస్ ఆస్తితో ముడిపెడుతూ ఈ కథనం తప్పుడు ఆరోపణలు చేసిందని కేటీఆర్ న్యాయవాదులు పేర్కొన్నారు. ఆ ప్రైవేట్ ప్రాజెక్ట్, దాని డెవలపర్ లేదా భవన అనుమతులతో కేటీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. మంత్రిగా ఉన్న సమయంలో ఆయన తన అధికారాన్ని దుర్వినియోగం చేశారనడం పూర్తిగా అవాస్తవమని, పాత, నిరాధారమైన ఆరోపణలను ఉద్దేశపూర్వకంగా మళ్లీ తెరపైకి తెచ్చారని ఖండించారు. కనీస ఆధారాలు లేకుండా కేవలం ఆయన ప్రతిష్ఠను, విశ్వసనీయతను దెబ్బతీయాలనే దురుద్దేశంతోనే ఈ ఫేక్ న్యూస్ ప్రచురించారని లీగల్ నోటీసులో పేర్కొన్నారు.

కనీస జర్నలిస్టు విలువలు పాటించకుండా, కేటీఆర్ వివరణ కోరకుండా చేసిన ఈ తప్పుకు గాను పబ్లిషర్‌కు 48 గంటల గడువు విధించారు. ఈ గడువులోగా సదరు పరువు నష్టం కలిగించే కథనాన్ని, దానికి సంబంధించిన డిజిటల్ లింక్‌లను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే, జరిగిన నష్టానికి బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని, భవిష్యత్తులో ఇలాంటి అవాస్తవ వార్తలు ప్రచురించకూడదని స్పష్టం చేశారు. ఈ షరతులను 48 గంటల్లోగా పాటించకపోతే, డెక్కన్ క్రానికల్ యాజమాన్యంపై తగిన సివిల్, క్రిమినల్ మరియు నష్టపరిహారం దావాలను వేస్తామని హెచ్చరించారు.

Related posts

ఇరాన్ లో 170 సైనిక స్థావరాలు నేలమట్టం?

Satyam News

అమరావతి పూర్తయితే లక్ష కోట్ల ఆదాయం

Satyam News

కేరళలో ఫీజుల పెంపుపై విద్యార్ధుల నిరసన

Satyam News

రిటైర్డ్ అధికారులకే పెద్ద పీట: మారని ఆనవాయితీ!

Satyam News

లోకేష్‌ మార్క్‌ పాలిటిక్స్‌.. జగన్ గజ గజ….

Satyam News

షాద్ నగర్ లో మెడికల్ షాపుల్లో విస్తృతంగా తనిఖీలు

Satyam News

Leave a Comment