ముఖ్యంశాలుహోమ్

‘మా పిల్లల రక్తం తాగిన రాక్షసులు మీరు’

#IranChildren

పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న చర్చల సందర్భంగా ఇరాన్ ఒక ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఆ ప్రదర్శనలో ఏమి ఉన్నదంటే…. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేసిన దాడుల మొదటి రోజున మీనాబ్ ప్రాంతంలో 168 మంది చిన్నారులు మరణించారు.

ఆ పిల్లలకు చెందిన రక్తంతో తడిసిన వస్తువులను తీసుకువచ్చి ప్రదర్శనగా ఉంచారు. ఇరాన్ ప్రతినిధి బృందం శనివారం ఇస్లామాబాద్‌కు చేరుకుంది. పార్లమెంట్ సభాపతి మొహమ్మద్ బాఘర్ ఘలిబాఫ్ నేతృత్వంలోని ఈ బృందం తమతో పాటు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల బాధను ప్రతిబింబించే ప్రతీకాత్మక వస్తువులను తీసుకువచ్చింది.

రక్తంతో ముద్రపడిన పాఠశాల సంచులు, చెప్పులు, తెల్లని పూలు, చిన్నారుల ఫోటోలు విమానంలోని ముందు వరుసలో ఉంచడం ద్వారా ఈ విషాదాన్ని ప్రపంచానికి తెలియజేసింది. ఈ బృందానికి “మీనాబ్ 168” అనే పేరు పెట్టారు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేసిన దాడుల మొదటి రోజున మీనాబ్ ప్రాంతంలో మరణించిన చిన్నారులను స్మరించేందుకు ఈ పేరు పెట్టినట్లు ఇరాన్ అధికారులు తెలిపారు.

మా పిల్లల హత్య మేం ఎన్నటకీ మరచిపోలేం

దక్షిణాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయం కూడా ఈ చిత్రాన్ని పంచుకుంటూ “మీనాబ్ పిల్లలను మేమెప్పటికీ మర్చిపోము” అని పేర్కొంది. ఇరాన్ అధికారుల ప్రకారం ఫిబ్రవరి 28న దక్షిణ ఇరాన్‌లోని మీనాబ్ పట్టణంలో ఉన్న షజరె తయ్యిబె బాలికల పాఠశాలపై జరిగిన దాడిలో 160 మందికి పైగా చిన్నారులు మృతి చెందినట్లు ఆరోపించారు.

అయితే ఈ సమాచారం స్వతంత్రంగా ధృవీకరించబడలేదు. కొన్ని రోజుల తరువాత విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆరగ్చీ సామూహిక సమాధుల కోసం తవ్వుతున్న ప్రదేశాన్ని చూపిస్తున్నట్లు పేర్కొంటూ ఒక వైమానిక చిత్రాన్ని విడుదల చేశారు. ఈ దాడిని ఆయన తీవ్రంగా ఖండిస్తూ “నిర్దాక్షిణ్య హత్య”గా అభివర్ణించారు. దీనికి అమెరికానే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆరోపించారు.

ఇదిలా ఉండగా, ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు జరగనున్నాయి. ఇరాన్ ప్రతిపాదించిన పది అంశాల కాల్పుల విరమణ ప్రణాళికపై ఈ సమావేశం ప్రధానంగా చర్చించనుంది. ఇరాన్ తరఫున ఘలిబాఫ్‌తో పాటు అరాఘ్చి మరియు ఇతర అధికారులు హాజరుకానున్నారు.

ఇస్లామాబాద్ చేరుకున్న ఇరాన్ బృందానికి పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఇషాక్ దార్, జాతీయ అసెంబ్లీ సభాపతి సర్దార్ అయాజ్ సాదిక్, సైన్యాధిపతి అసీమ్ మునీర్, అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నక్వీ స్వాగతం పలికారు.

అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ హాజరుకానున్నారు. 2011 తరువాత పాకిస్థాన్‌కు అమెరికా ఉపాధ్యక్షుడు రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ చర్చలు ఉద్రిక్తతలను తగ్గించి యుద్ధాన్ని ముగించే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సమావేశంపై ఆసక్తి నెలకొంది.

Related posts

అన్ని జిల్లాల్లో ఘనంగా విశ్వకర్మ జయంతి

Satyam News

కొల్లేరు సరిహద్దులు మార్పుల కోసం కేంద్రానికి లేఖ

Satyam News

విలక్షణ  దర్శకుడు డాక్టర్ పి సి ఆదిత్య కు వందేమాతరం అవార్డు

Satyam News

మీరట్ లో ఘోర ప్రమాదం: 5 గురు చిన్నారులు మృతి

Satyam News

అమెరికా లో అరకు కాఫీ… న్యూయార్క్ లో ఆనంద్ మహేంద్ర స్టోర్

Satyam News

కుప్పలు తెప్పలుగా తరలివస్తున్న నిరుద్యోగులు

Satyam News

Leave a Comment