ఖమ్మంహోమ్

మావోయిస్టుల ఫేక్‌ ఎన్‌కౌంటర్స్‌ విచారకరం

#KunamaneniSambasivarao

మావోయిస్టులను చంపుకుంటూ పోవడమంటే మానవ హననం తప్ప మరొకటి కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు  జంగిల్‌ రాజ్‌ పరిపాలనకు పరాకాష్ట అని వారన్నారు. 

ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల పోలీసులు కూడా  ఇందులో పావులుగా మారారని ఆయన పేర్కొన్నారు.  ఈ రోజు మాడేరుమిల్లులో జరిగిన హిడ్మా ఎన్‌కౌంటర్‌, అందకంటే ముందు మావోయిస్టులపై జరిగిన ఎన్‌కౌంటర్స్‌ మొత్తం ఫేక్‌ ఎన్‌కౌంటర్స్‌ అని కూనంనేని తెలిపారు. బూటకపు ఎన్‌ కౌంటర్స్‌తో మనుషులను చంపుకునే వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదని, మావోయిస్టులు ఏదైన నేరాలు చేసివుంటే వారిని అరెస్టు చేసి చట్టభద్దంగా విచారణ జరిపించాలని ఇలాంటి ఫేక్‌ ఎన్‌కౌంటర్‌లు చేయడం విచారణకరమని అన్నారు.

మావోయిస్టులపై జరుగుతున్న ఎన్‌కౌంటర్లపై విచారణ జరిపించాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు.

Related posts

రేపటి నుండి భాద్రపద మాసం ప్రారంభం

Satyam News

క్రికెట్‌ స్టార్ స్మృతి మంధాన వివాహానికి మరో అడ్డంకి

Satyam News

గుడివాడలో వేడెక్కిన రాజకీయం

Satyam News

మునిసిపల్ చైర్మన్ ఆర్యవైశ్య మహిళ ఎన్నిక

Satyam News

ఎల్‌నినో ప్రభావం పై పూర్తి స్థాయి సమీక్ష

Satyam News

లాజిస్టిక్స్ హబ్ ఆఫ్ ఇండియాగా ఏపీ

Satyam News

Leave a Comment