26.3 C
Hyderabad
September 19, 2026
హైదరాబాద్హోమ్

సమ్మిళిత అభివృద్ధిలో జనాభా లెక్కలు అవసరం

2027 జనాభా లెక్కలకు సంబంధించి తెలంగాణలో 2026 ఏప్రిల్ 26న స్వీయ గణన అధికారికంగా ప్రారంభమైన సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ. కిషన్ రెడ్డి నిర్ణీత ఆన్‌లైన్ జనగణన పోర్టల్ ద్వారా తన వివరాలను నమోదు చేశారు.

తెలంగాణ జనగణన కార్యాలయం ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ దేశ అభివృద్ధి ప్రయాణంలో జనాభా లెక్కలు ఒక పునాది రాయి వంటివని అన్నారు. ప్రణాళికా రచన, సుపరిపాలన, సమానాభివృద్ధికి ఇవి కీలక సాధనాలుగా ఆయన అభివర్ణించారు. సమర్థవంతమైన విధాన రూపకల్పన, సమ్మిళిత వృద్ధికి ఖచ్చితత్వంతో కూడిన సమగ్రమైన గణాంకాలు చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు.

2027 జనాభా లెక్కల ప్రాముఖ్యతను వివరించిన శ్రీ జీ. కిషన్ రెడ్డి… ఆధునిక డిజిటల్ సాంకేతికతను ఉపయోగించటం ద్వారా ఇదొక పరివర్తనాత్మక దశగా నిలుస్తుందని పేర్కొన్నారు. తద్వారా పారదర్శకత, సామర్థ్యం, సమ్మిళితత్వం మరింత పెరుగుతాయని ఆయన అన్నారు. 2026 ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు స్వీయ గణన సౌకర్యం అందుబాటులో ఉంటుందని.. ఆ తర్వాత 2026 మే 11 నుంచి జూన్ 9 వరకు గృహ జాబితా సేకరణ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. ఇది సమగ్ర సమాచార సేకరణకు బలమైన పునాది వేస్తుందని ఆయన వివరించారు.

దేశవ్యాప్తంగా ఉన్న సామాజిక-ఆర్థిక పరిస్థితులపై 2027 జనాభా లెక్కలు స్పష్టమైన అవగాహనను కల్పిస్తాయని.. అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందేలా చూడటంలో ఇవి సహాయపడతాయని కేంద్ర మంత్రి ఉద్ఘాటించారు.

జనాభా లెక్కల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరిన కేంద్ర మంత్రి.. ఇందులో ఖచ్చితమైన సమాచారాన్ని అందించాలని సూచించారు. సేకరించే ప్రతి సమాచారం దేశ భవిష్యత్తుతో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘వికసిత్ భారత్’ స్వప్నాన్ని సాకారం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ జనాభా లెక్కల డైరెక్టరేట్ సంచాలకులు భారతి హోళికేరి మాట్లాడుతూ.. అధికారిక వెబ్‌సైట్ అయిన https://se.census.gov.in లో స్వీయ గణన ప్రక్రియను పూర్తి చేయవచ్చని, తద్వారా జనాభా లెక్కల్లో నేరుగా పాల్గొనవచ్చని తెలిపారు. సమర్పించిన సమాచారం పూర్తి గోప్యంగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు. సమాచారాన్ని సమర్పించిన వెంటనే ఒక ‘స్వీయ గణన ఐడీ’ వస్తుందని.. ఆ తర్వాత జనగణన అధికారి (ఎన్యూమరేటర్) దానిని పరిశీలించి ఖరారు చేస్తారని ఆమె వివరించారు.

ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్. వీ. కర్ణన్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా తదితరులు పాల్గొన్నారు.

Related posts

రేవంత్ సర్కార్ పై బీజేపీ చార్జిషీట్

Satyam News

ఘనంగా కవిత జన్మదిన వేడుకలు

Satyam News

ప్రపంచస్థాయి సాంకేతికతతో విపత్తు రక్షణ వ్యవస్థ బలోపేతం

Satyam News

మాల్యవంతం వారి ఇంట అలరించిన బొమ్మలకొలువు

Satyam News

రంజాన్ సందర్భంగా రేవంత్ ఇఫ్తార్ విందు

Satyam News

జాత్యహంకారంతో సిక్కు యువతిపై అత్యాచారం

Satyam News

Leave a Comment