ప్రత్యేకంహోమ్

జగన్ ఒక్కరోజు ఫ్లయిట్ ఖర్చుతో.. మనం ఎన్నేళ్లు బతకొచ్చో తెలుసా…!!

#jagan

మనదేశంలో రిచీ రిచ్‌.. రిచెస్ట్‌ పొలిటీషియన్‌ ఎవరంటే.. ఎవరైనా తడుముకోకుండా ఠక్కున చెప్పే పేరు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి. ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన ఆస్తులు వందల కోట్లలో ఉంటాయి. కానీ జగన్‌మోహన్‌రెడ్డి రియల్‌ నెట్‌వర్త్‌ దానికి ఎన్నో వేల రెట్లు.. అంటే లక్షల కోట్లలో ఉంటుందని ఆరోపణలు, అంచనాలు ఉన్నాయి.

హైదరాబాద్, తాడేపల్లి, బెంగళూరు.. ఇలా వైఎస్ జగన్‌ ఎక్కడికి వెళ్లినా.. ఆయనకు సువిశాలమైన ప్యాలెస్‌లు కోకొల్లులుగా ఉన్నాయనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక జగన్‌ ఎక్కడికి వెళ్లాలన్నా ప్రత్యేక విమానంలోనే వెళ్తారు. హైదరాబాద్‌ నాంపల్లి కోర్టులో అవినీతి కేసుల విచారణకు హాజరవడానికి ఆయన ప్రత్యేకంగా లగ్జరీ ఛార్టెడ్‌ ఫ్లయిట్‌ బుక్‌ చేసుకున్నారు. జగన్‌రెడ్డి బుక్‌ చేసుకున్న ప్రత్యేక విమానం అద్దె అక్షరాలా గంటకు ఎనిమిది లక్షలు.

బెంగళూరు నుంచి ఖాళీగా బయల్దేరిన ఈ ప్రత్యేక విమానం.. విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయింది. అక్కడ జగన్‌ను ఎక్కించుకొని హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయానికి వచ్చింది. కోర్టు విచారణ పూర్తి చేసుకొన్న తర్వాత.. లోటస్‌ పాండ్‌ ఇంటిలో ఉంటున్న తల్లి విజయమ్మతో మాట్లాడి అక్కడ కొంత సేపు విశ్రాంతి తీసుకున్నారు.

మళ్లీ బేగంపేట ఎయిర్‌పోర్టులో నిలిచి ఉన్న స్పెషల్‌ ఫ్లయిట్‌లో బెంగళూరు వెళ్లింది. ఈ విమానం గాల్లో ఎగిరేటప్పుడు మాత్రమే కాదు.. ఎయిర్‌పోర్టులో పార్కింగ్‌ చేసి ఉంచిన సమయంలో కూడా గంటకు 8 లక్షల చెల్లించాలి. అంటే పన్నెండు గంటల కోసం ఫ్లయిట్‌ బుక్‌ చేసుకొంటే.. మొత్తం  కోటీ ఇరవై లక్షలు అద్దె రూపంలో చెల్లించాలి.

నెలకు 50 వేల రూపాయలు సంపాదించే వ్యక్తికి ఏడాదికి 6 లక్షలు వస్తాయి. అతని ఆదాయం కోటీ ఇరవై లక్షలు కావాలంటే.. 20 సంవత్సరాలు పని చేయాలి. అంటే ఒక మిడిల్‌ క్లాస్‌ పర్సన్‌ సగం జీవితంలో సంపాదించే మొత్తాన్ని జగన్‌ సగం రోజు విమానం అద్దె కోసం ఖర్చు చేస్తున్నారన్నమాట. మన వైసీపీ బాస్‌ చాలా రిచ్‌ అనడంలో తప్పేం లేదు కదా.

Related posts

యువ అడ్వకేట్ ను జైల్లో వేయించిన ఏపి హైకోర్టు న్యాయమూర్తి

Satyam News

పేదలకు పట్టాభిషేకం: 28,445 కుటుంబాలకు పట్టాలు

Satyam News

శ్రీ కపిలేశ్వరాలయంలో విశేష‌ పూజ హోమ మ‌హోత్స‌వాలు

Satyam News

మరో కన్నడ చిత్రంలో నటిస్తున్న డాక్టర్ పిసి ఆదిత్య

Satyam News

రెండు యూట్యూబ్ ఛానెళ్ల పై కేసులు

Satyam News

గంజాయి విక్ర‌యిస్తే ఏన్డీపీఎస్ చ‌ట్టం మేర‌కు జైలు

Satyam News

Leave a Comment