చిత్తూరుహోమ్

తిరుపతిలో ఆరుగురిపై పిడి యాక్ట్

#TirupatiPolice

తిరుపతి జిల్లాలో 6 గురు నేరస్థులపై పిడి యాక్ట్(PD Act) నమోదు చేశారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు జిల్లాలో ప్రజా శాంతి భద్రతకు, ఆస్తులకు ముప్పుగా వ్యవహరిస్తున్న వ్యక్తులపై ముందస్తు చర్యగా ప్రవెంటివ్ డిటెక్షన్ యాక్ట్ కింద తిరుపతి జిల్లా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు.

నేరానికి దారితీసే పరిస్థితులను ముందుగానే అరికట్టే ఉద్దేశ్యంతో, హత్య, హత్యాయత్నం, మహిళలపై నేరాలు, అక్రమ రవాణాదారులు, దోపిడీదారులు, గంజాయి మరియు మాదకద్రవ్య నేరస్థులు, రౌడీలు, అనైతిక రవాణా నేరస్థులు, భూ కబ్జాదారులు లాంటి నేరచరిత్ర గల వ్యక్తులపై PD Act అమలు చేయడం జరిగింది. జిల్లాలో నేరస్తులు ప్రజల భద్రతకు, ప్రజల ఆస్తులకు మరియు ప్రజల శాంతికి విఘాతం కలిగించే వారు ఎవరైనా కనిపించినపుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.

ప్రజల సహకారంతోనే ప్రమాదకర నేరస్తులను చట్టం ముందుకు తెచ్చి, కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వివిధ నేరాలలో పాల్గొన్న 06 మంది వ్యక్తులపై తిరుపతి జిల్లా పోలీసులు PD Act అమలు చెయ్యడం జరిగింది.

ముఖ్యంగా డ్రగ్స్, హత్యానేరాలు, దొంగతనాలు, రౌడీయిజం మరియు భూ కబ్జా లాంటి నేరాలు పదే పదే చేస్తూ సమాజంలో శాంతి భద్రతలకు ముప్పు కలిగించే వారిని గుర్తించి మళ్ళీ ఆ నేరాలను చేయకుండా నియంత్రించడానికి వారిపై PD Act నమోదు చేయడం జరిగింది. తిరుపతి జిల్లాలో పునరావృత/పదే పదే నేరాలలో పాల్గొంటున్న వారి సమాచారం సేకరించి ప్రత్యేక జాబితా తయారు చేయడం జరిగింది.

వరుస దొంగతనాలు, ప్రజా శాంతి భద్రతకు భంగం కలిగించే విధంగా వరుసగా నేరాలకు పాల్పడుతున్న నిందితుల కార్యకలాపాలను పూర్తిగా అణిచివేయాలనే దృఢ సంకల్పంతో చట్ట పరంగా కఠిన చర్యలలో భాగంగా PD Act ను అమలు పరచడం జరిగింది. నిందితులు తిరిగి నేరాలకు పాల్పడకుండా ముందస్తుగా చర్య తీసుకోవడమే కాకుండా చట్టాన్ని ఉల్లంఘించాలనే ఆలోచన ఉన్నవారికి ఒక గుణపాఠంగా, చట్టాన్ని ఉల్లఘించే వారిపై కఠిన చర్యలలో భాగంగా ఈ చర్య తీసుకోవడం జరిగింది.

డ్రగ్స్, గంజాయి అక్రమ మద్యం విక్రయాలు, భూకబ్జాలు చేసే వారిపై కూడా త్వోరలో PD Act చట్టం క్రింద్ర తీసుకురావడం జరుగుతుంది. తిరుపతి జిల్లాలో లక్షల మంది భక్తులు వచ్చి వెళుతుంటారు, కాబట్టి భక్తుల భద్రత, శాంతి భద్రతలపై విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలలో భాగమే ఈ చర్య. POCSO మైనర్ బాలికలపై అఘాయిత్యాల విషయంలో ప్రత్యేక దృష్టి ఉంచి వారిపై రౌడీ షీట్స్ ఓపెన్ చేయడమే కాకుండా పదే పదే ఇటువంటి నేరాలకు పాల్పడితే వారిపై కూడా PD Act నమోదు చేయడానికి సమాచారం సేకరించడం జరుగుతుంది.

Related posts

ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు రూ.కోటి విరాళం

Satyam News

48 శాతం తగ్గిన సీజనల్ వ్యాధులు

Satyam News

ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్‌రెడ్డి.. ఆ రెండు పార్టీలకి బిగ్‌ షాక్‌

Satyam News

సింహ వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల అభయం

Satyam News

బాల‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణే క‌మిష‌న్ ప‌ర‌మావ‌ధి

Satyam News

పాత వారికే షాపులివ్వాలి …. లేకుంటే రిలే నిరాహార దీక్ష

Satyam News

Leave a Comment