గుంటూరుహోమ్

పదో తరగతి పరీక్షల నిర్వహణపై సమావేశం

#10thClass

పల్నాడు జిల్లాలో 2026 మార్చి 16 నుండి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలకు సంబంధించి శుక్రవారం స్థానిక పిఎన్సి అండ్ కేఆర్ పాఠశాలలో సమావేశం జరిగింది. జిల్లాలోని వివిధ పాఠశాలలకు సంబంధించిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ ఇచ్చే నియమించబడిన చీఫ్ సూపరిండెంట్, డిపార్ట్మెంట్ అడిషనల్ ఆఫీసర్లు శిక్షణలో పాల్గొన్నారు. పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి పీవీజే. రామారావు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా మౌలిక వసతులు కల్పించాలని ఆదేశాలు ఇచ్చారు.

ఎండలు అధికంగా ఉండటం వలన అందుబాటులో అవసరమైన అంత మేరకు త్రాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు పరీక్షల రాసే గదుల్లో పూర్తిస్థాయిలో వెళుతూ ఉండే విధంగా చూడాలని, ఫ్యాన్లు, ఇతర ఫర్నిచర్, మెడికల్ కిట్లు కచ్చితంగా అక్కడ ఉండాలన్నారు. ఈనెల 13, 14 తేదీలలో పరీక్ష పత్రాలను డిపాజిటింగ్ చేయడం ఉంటుందన్నారు.

అదేవిధంగా ఇన్విజిలేటర్లకు శిక్షణ ఇస్తామన్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 128 పరీక్షా కేంద్రాలలో 26 515 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ షేక్ సుభాని, వి. ఏసుబాబు, జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పి వెంకటరమణ, అధికారులు ఐ కృష్ణా నాయక్, ఆర్ గోవిందరాజులు, సెల్వ రాజు,శ్రీనివాసరావు, మండల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

Related posts

కపిల్ శర్మ కేఫ్‌పై మూడోసారి కాల్పులు

Satyam News

పోలీసుల వేధింపులతో ఉర్దూ అకాడమీ ఉద్యోగి ఆత్మహత్య?

Satyam News

జగన్‌ మరో మూడు ముక్కలాట..??

Satyam News

రాష్ట్రంలో కోరమండల్ పెట్టుబడి రూ.2,000 కోట్లు

Satyam News

పశ్చిమ బెంగాల్ లో ఉమ్మడి పౌరస్మృతి అమలు

Satyam News

ఏపీకి కేంద్రం భారీ గ్రాంట్‌… పంచాయితీలకు పండగ

Satyam News

Leave a Comment