చిత్తూరుహోమ్

తిరుమలలో భక్తులకు ఇబ్బందులు

#Tirumala

తిరుపతి తిరుమల కొండపై బుధవారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ముందు, తర్వాత ఇబ్బందులు వచ్చాయని భక్తులు తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లోని 18వ కంపార్ట్ మెంట్ లో పోలీస్ చెకింగ్ తర్వాత తోపులాట జరిగింది. అక్కడ ఒక సెక్యూరిటీ సిబ్బందిని, ఇద్దరు శ్రీ వారి సేవకులను నియమించాలని, పోలీస్ చెకింగ్ పూర్తయిన తర్వాత బారికేడ్ ఏర్పాటు చేసి తోపులాట లేకుండా దర్శనానికి పంపాలని కోరారు.

బుధవారం మధ్యాహ్నం 1 నుండి 2 గంటల మధ్య దర్శనం చేసుకున్న తర్వాత శ్రీ వారి హుండీ ఎదురుగా సబేరా ముందు 20 నిముషాలు నిలబెట్టారని, హుండీలో డబ్బులు వేయడానికి తోపులట అయిందని, బయటకు వెళ్ళడానికి తోపులాట అయిందని భక్తులు చెప్పారు. తోపులాట లేకుండా బయటకు పంపాలని, బారికేడ్లు ఏర్పాటు చేసి శ్రీ వారి సేవకులను నియమించాలని కోరారు.

సిసి కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేయాలని, అధికారులు ఎసి గదులు, ఎసి వాహనాలు వదిలి తనిఖీ చేయాలని కోరారు. విఐపిలు, ప్రముఖులు స్వామి వారిని దర్శించుకున్నారని వార్తలు రాయడం బంద్ చేసి ఇబ్బందులు, సమస్యల గురించి పత్రికల్లో రాయాలని కోరారు. పిఎసి-4. కౌంటర్ 5 లగేజీ దగ్గర నాలుగు కౌంటర్లు ఉన్నాయి. కాని ఒక కౌంటర్ పని చేసింది.తిరుపతిలోని శ్రీనివాసం గెస్ట్ హౌస్ లో బి బ్లాక్ దగ్గర ఒక లిఫ్ట్ పని చేసింది.

యాత్రికులు ఇబ్బందులకు గురయ్యారు. అన్ని లిఫ్ట్ లు పని చేసే విదంగా చర్యలు తోసుకోవాలని భక్తులు కోరారు. తిరుమల కొండపై పరిశుభ్రత బాగుంది. నాణ్యమైన భోజనం వసతి బాగుంది. దేశంలో నెంబర్ వన్.కాని చిన్న సమస్యలు నిమిషాల్లో పరిష్కారం చేసే సత్తా అధికారులకు ఉంది. కాని చేయడం లేదు ఎందుకో.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

యువతకు చూపాల్సింది రీల్స్ కాదు… భవిష్యత్తు

Satyam News

నేటి నుంచి టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్

Satyam News

విధి నిర్వహణలో ఉన్న అధికారిపై కండక్టర్ ‘అటాక్’

Satyam News

గిరిజన విద్యార్ధులకు అండగా మంత్రి నారా లోకేష్

Satyam News

అప్ర‌మ‌త్తంగా ఉండాలి: ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచ‌న‌

Satyam News

టీటీడీ కాలేజీల ఆన్ లైన్ అడ్మిషన్లు ప్రారంభం

Satyam News

Leave a Comment