ముఖ్యంశాలుహోమ్

మమతా బెనర్జీని దెబ్బతీసిన అహంకారం

#Mamata

వాస్తవాలను గ్రహించకుండా అహంకారంతో ప్రవర్తించడం వల్లే మమతా బెనర్జీకి ఘోర పరాభవం ఎదురైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేసినా దాన్ని రాజకీయ కారణంగా మమతా బెనర్జీ ప్రచారం చేశారు. దాంతో దేశ హితం కోసం మేం చేస్తున్న పనులకు మమతా బెనర్జీ సహకరించడం లేదనే వాదన బీజేపీ ప్రారంభించింది.

ఇది చివరకు మమతా బెనర్జీ కొంప ముంచే స్థితికి వచ్చింది. బీజేపీ చేస్తున్న చర్యలను ఎన్నికల ఎజెండాగా మలచడం మమతా బెనర్జీ చేసిన ప్రధమ తప్పు. గత మూడు టర్మ్‌లు టీఎంసీ విజయానికి మహిళలు ప్రధాన కారణం. అయితే ఆర్జీకర్‌ ఆసుపత్రిలో జరిగిన ఘోరమైన మానభంగం కేసు, సందేశ్‌ఖాళి వివాదం మహిళలపై భద్రతపై నీలి నీడలు కమ్మేలా చేశాయి.

బీజేపీ ఈ అంశాలను ఉపయోగించుకుంది. ఆర్టీకర్‌ బాధితురాలి తల్లిని ఏకంగా ఎ‍న్నికల బరిలో దింపింది. మహిళా సెంటిమెంట్‌ను బీజేపీ ఓట్లుగా మార్చుకుంది. బెంగాల్‌లో టీఎంసీ సంప్రదాయంగా మైనారిటీ ఓటు బ్యాంక్‌పై ఆధారపడింది. ఆ జనాభాలో 27 శాతం టీఎంసీ మద్దతుగా ఉండేది. అయితే ఎన్‌ఆర్‌సీ, యూసీసీ భయాలు అలాగే ఓటర్ల జాబితా (SIR) వివాదం ఈసారి ముస్లిం ఓటు ధోరణిని ప్రభావితం చేసింది.

అంతేకాదు ముస్లిం ప్రాబల్యం ఉన్న మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర దినాజ్పూర్ లలో ముస్లిం ఓట్లలో చీలిక ఏర్పడిందని బీజేపీకి ఇది బాగా కలిసొచ్చిందని చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో పనిచేసే వలస కార్మికులు తిరిగి వచ్చి ఓటు వేశారు. ఓటర్ల జాబితాలో పేరు ఉండాలంటే తప్పనిసరిగా ఓటు వేయాలని భావించారు. వీరి ఓటు ధోరణి ఎన్నికల్లో కీలకంగా మారింది.

ఈ క్రమంలోనే బెంగాల్‌ చరిత్రలోనే భారీగా పోలింగ్‌ నమోదు అయ్యింది. రాష్ట్ర జనాభాలో 17 శాతం ఉన్న మటువా కమ్యూనిటీ బీజేపీకి బలమైన మద్దతు ఇచ్చింది. ఈ ఓటు టీఎంసీకి పెద్ద దెబ్బగా మారింది. టీఎంసీ కేవలం తన ప్రచారం మీదే ఆధారపడింది. స్టార్‌ క్యాంపెయినర్లను రంగంలోకి దించలేకపోయింది. కానీ, బీజేపీ మాత్రం కేంద్రం నుంచి భారీ స్థాయిలో ప్రచార యంత్రాంగం, నాయకులను రప్పించుకుంది.

ర్యాలీలు, రోడ్‌షోలు, సభలు నిర్వహించింది. ఇది ఎన్నికల్లో బీజేపీకి బలమైన ప్రోత్సాహం ఇచ్చింది. తద్వారా ఓటర్లపై ప్రభావం చూపించింది. ప్రధాని మోదీ వ్యక్తిత్వం, దఫదఫాలుగా చేసిన సుదీర్ఘ ప్రచారం, ప్రసంగాలు కమలం పార్టీకి బాగా కలిసొచ్చాయి. బెంగాల్‌లో కేంద్రం జోక్యం తగదంటూ గత ఐదేళ్లుగా మమతా బెనర్జీ పోరాటం చేస్తూ వస్తున్నారు.

ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక సవరణలో దాదాపు 91 లక్షల ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయి. వీటిపై ఆమె అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉద్యమానికి దిగారు. అయితే టీఎంసీపై ఇవేవీ ప్రజల్లో సింపథీని రాబట్టలేకపోయాయి. ‘‘బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడి ఆహారపు అలవాట్లను కూడా మారుస్తారు’’ అంటూ ఈ మమతా బెనర్జీ ఎన్నికల్లో ఉధృతంగా ప్రచారం చేశారు. అయితే ఆ ప్రచారాన్ని అక్కడి ఓటర్లు సున్నితంగా తిరస్కరించారు. మార్పు అవసరం అనే బీజేపీ నినాదానికి పట్టం కట్టారు.

Related posts

ఖార్గ్ ద్వీపం చుట్టూ మోహరిస్తున్న అమెరికా దళాలు

Satyam News

దేశ ఆహార శుద్ధి రంగంలో 9% వాటాతో ఏపీ నంబర్ వన్

Satyam News

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రతి రోజూ కీలకమే

Satyam News

కాలభైరవునికి కలకండ, అటుకుల పాయసం నైవేద్యం

Satyam News

ఇళ్ల స్థలాల లబ్ధిదారులను తక్షణమే ప్రకటించాలి

Satyam News

ఈ కేసేంటి..మీ కథేంటి..ఆళ్లకు హైకోర్టు చుక్కలు

Satyam News

Leave a Comment