మహబూబ్ నగర్హోమ్

బస్సు సేవలకు అడ్డంకులు సృష్టిస్తే కఠిన చర్యలు

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం పోలీస్ శాఖ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి జానకి మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ప్రైవేట్ బస్సులు నడుపుతున్న డ్రైవర్లు ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దని జిల్లా ఎస్పీ డి.జానకి,ఐపీఎస్ తెలిపారు.

అవసరమైన భద్రతా చర్యలు పోలీసు శాఖ తరఫున చేపట్టబడుతున్నాయని,డ్రైవర్లు నిరభ్యంతరంగా తమ విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజల రవాణా సౌకర్యాన్ని నిరవధికంగా కొనసాగించేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టిందని వెల్లడించారు.

ఆర్టీసీ బస్సులను ప్రైవేట్ వ్యక్తులు నడుపుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బస్సుల ప్రయాణానికి ఎలాంటి అడ్డంకులు సృష్టించినా, మార్గమధ్యంలో బస్సులను ఆపినా,డ్రైవర్లపై దాడులకు పాల్పడినా అలాంటి చర్యలను చట్టవిరుద్ధంగా పరిగణించి సంబంధిత వ్యక్తులపై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రజా రవాణా సేవలను భంగం కలిగించడం సహించబోమని స్పష్టం చేశారు.అదేవిధంగా ఉద్దేశపూర్వకంగా అల్లర్లు సృష్టించడం,ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగించడం,అధికారులపై దాడులు చేయడం వంటి చర్యలకు పాల్పడిన వారిపై కూడా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం,వదంతులు వ్యాప్తి చేసే వారిపై కూడా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని, అలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.సమ్మెలో పాల్గొనే కార్మికులు మరియు ప్రజలు పరస్పర గౌరవంతో వ్యవహరించి ఎలాంటి ఉద్రిక్తతలకు తావు లేకుండా చూడాలని ఎస్పీ డి జానకి ఐపిఎస్ విజ్ఞప్తి చేశారు.

ప్రజల శాంతి భద్రతలను కాపాడటంలో పోలీస్ శాఖకు సహకరించాలని,ఎక్కడైనా అనుమానాస్పద పరిస్థితులు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.

Related posts

లైసెన్స్డ్ సర్వేయర్లను నట్టేట ముంచిన రేవంత్ సర్కార్

Satyam News

పాల‌మూరు యూనివ‌ర్సిటీలో విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌..!

Satyam News

డిఎస్సీ 2025 పై సృతి మించిన వైసీపీ ఫేక్ ప్రచారం

Satyam News

భూ రీ-సర్వేను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి

Satyam News

ఆకివీడులో రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

Satyam News

డిసెంబర్ 1 నుండి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

Satyam News

Leave a Comment