ముఖ్యంశాలుహోమ్

అంగన్‌వాడీలకు వెంటనే వేతనాలు పెంచాలి

#CITU

పెరిగిన ధరలకు అనుగుణంగా అంగన్వాడీలకు వేతనాలు రూ.26 వేలకు పెంచాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఏ.పీ అంగన్వాడీ వర్కర్స్ , హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పి.భారతి హెచ్చరించారు. బుధవారం ఏలూరు స్థానిక సిఐటియు కార్యాలయంలో యూనియన్ జిల్లా కమిటీ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో పి.భారతి మాట్లాడుతూ జిల్లాలో అంగన్వాడీ వర్కర్, హెల్పర్ పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసి మూడు మాసాలు గడిచినా  నేటికీ ఖాళీ పోస్టులు భర్తీ చేయకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గత 6 సంవత్సరాలుగా అంగన్వాడీలకు ఒక రూపాయి కూడా వేతనం పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్ని అంటుతున్నా వేతనాలు మాత్రం పెంచడం లేదని విమర్శించారు. ఎన్నికల ముందు అంగన్వాడీల సమ్మె సందర్భంగా ఎన్నో వాగ్దానాలు చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి 26 మాసాలు పూర్తయినా వేతనాలు పెంచకపోవడం అన్యాయమన్నారు.

యాప్ ల పేరుతో అంగన్వాడీలపై పని భారాన్ని పెంచారన్నారు. యాప్స్ అన్ని కలిపి ఒకే యాప్ గా మార్చాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీలకు పీ.ఎఫ్, ఈ.ఎస్.ఐ అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత సమ్మె కాలంలో కూటమి నేతలు సమ్మె శిబిరాల వద్దకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న చందంగా మాట తప్పారని అన్నారు.

ఎన్నికల ముందు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను మినిట్స్ అమలు చేయాలని  డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా కార్యదర్శి కే.మాణిక్యం మాట్లాడుతూ మిగిలిన మినీ సెంటర్లను మెయిన్ సెంటర్ లుగా మార్పు చేయాలని విజ్ఞప్తి చేశారు. వేతనంతో కూడిన మెటర్నటీ సెలవులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలను సమీకరించి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

ఖాళీగా ఉన్న సూపర్వైజర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎఫ్.ఆర్.ఎస్ పేరుతో అంగన్వాడీల అనేక ఇబ్బందులు పడుతున్నారని frs రద్దు చేయాలనికోరారు. ప్రభుత్వం మెనూ చార్జీలు పెంచకుండా ఇష్టం వచ్చినట్లుగా మెనూ మారుస్తూ అంగన్వాడీలను తీవ్రంగా ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే అన్ని రకాల సరుకులు సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు ఎం తులసి, రాజకుమారి, విమల, సరళ, పి ఎల్ ఎస్ కుమారి, ఇందిరా, ఆదిలక్ష్మి, భూదేవి తదితరులు ప్రసంగించారు.

Related posts

జగన్ చెంప చెళ్ళుమనిపించిన కేంద్రం

Satyam News

మా జీవితాలతో ఆడుకోవద్దు జగన్

Satyam News

హోర్మోజ్ జల సంధిపై పట్టువీడని ఇరాన్

Satyam News

వైకుంఠద్వార దర్శనాలకు విస్తృత ఏర్పాట్లు

Satyam News

పురుషుడిలో స్త్రీ లక్షణాలు: గుంటూరు లో అరుదైన వ్యాధి

Satyam News

సజ్జనార్ వార్నింగ్తో భయపడ్డ యూట్యూబర్లు

Satyam News

Leave a Comment