ముఖ్యంశాలుహోమ్

మహిళా బిల్లు ఆమోదానికి సమాజ్ వాది పార్టీ మద్దతు

పార్లమెంటులో ఈ నెల 16, 17, 18 తేదీలలో ప్రవేశపెట్టనున్న మహిళా బిల్లుకు సమాజ్ వాది పార్టీ జాతీయ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ మద్దతు ప్రకటించనున్నారని సమాజ్ వాది పార్టీ జాతీయ నాయకులు మధు బోట్ట యాదవ్ అన్నారు. శుక్రవారం బాపట్ల జిల్లా సమాజ వాది పార్టీ ఆధ్వర్యంలో బాపట్ల పట్టణంలోని జి.బి.సి రోడ్డులో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మధు బోట్ట యాదవ్ మాట్లాడుతూ

సమాజ్ వాది పార్టీ జాతీయ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ త్వరలో బాపట్ల విచ్చేయుచున్నారని చెప్పారు. భారతదేశంలో సమాజ్ వాది పార్టీ బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పని చేస్తుందన్నారు. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ప్రజా వ్యతిరేక పాలనపై సమాజ్ వాది పార్టీ ఒక్కటే నిలదీసి పనిచేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా ప్రత్యేక హోదా అంశాన్ని అఖిలేష్ యాదవ్ లేవనెత్తారని చెప్పారు.

బాపట్ల జిల్లా సమాజ్ వాది పార్టీ నాయకులు మేధా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజాసేవే లక్ష్యంగా సమాజ వాది పార్టీ ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా సమాజ్ వాది పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Related posts

ప‌రకామ‌ణి చోరీ కేసులో కీలక వ్యక్తి హత్య?

Satyam News

రోజు రోజుకూ పెరుగుతున్న ‘తాగుడు’ ఆదాయం

Satyam News

మార్చి లో గూగుల్ కు భూమి పూజ

Satyam News

అమెరికా అధ్యక్షుడికి ఇరాన్ లీడర్ సలహా

Satyam News

ఏపీలో PPP వైద్య కళాశాలలు: కష్టాలకు పరిష్కారమా?

Satyam News

ట్రైలర్ రిలీజ్: మద్యం కుంభకోణంపై సంచలన చలన చిత్రం

Satyam News

Leave a Comment