29.2 C
Hyderabad
September 20, 2026
ప్రత్యేకంహోమ్

వైసీపీ లిక్కర్ దందా: జీతాలకు ఎసరు పెట్టి రూ. 400 కోట్లు స్వాహా!

#liquorscam

వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వేల కోట్ల లిక్కర్ స్కామ్‌లో రోజుకో సంచలనం బయటపడుతోంది. ఫేక్ లిక్కర్ అమ్మకాలు, డిస్టిలరీల ఎంపిక, రవాణా ఛార్జీల పేరుతో వేల కోట్లు కొల్లగొట్టిన ముఠా..మద్యం దుకాణాల్లో పని చేసే చిరు ఉద్యోగులను సైతం వదల్లేదని తెలుస్తోంది. వారి జీతాల్లో భారీ ఎత్తున కోత పెట్టిన దాదాపు 400 కోట్లకుపైగా కొట్టేసినట్లు తెలుస్తోంది.

జగన్ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన అవుట్‌ సోర్సింగ్ సిబ్బంది నియామకంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. రాయచోటికి చెందిన ఓ వ్యక్తిరెడ్డి అండ్ రెడ్డి మ్యాన్‌పవర్ ఏజెన్సీకి ఈ దుకాణాల్లో సిబ్బందిని సమకూర్చే బాధ్యతను అప్పగించారు. ఈ ఏజెన్సీ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,934 దుకాణాల్లో సుమారు 9 వేల మందిని నియమించినట్లు రికార్డులు సృష్టించారు. అయితే క్షేత్రస్థాయిలో తక్కువ మందితో పని చేయించుకుంటూ, ఏకంగా 11 వేల నుంచి 12 వేల మంది పనిచేస్తున్నట్లు నకిలీ రిపోర్టులు చూపించి ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించారు.

అంతేకాకుండా, విధుల్లో ఉన్నచిన్నస్థాయి ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాల్లోనూ భారీగా దోపిడీకి పాల్పడ్డారు. ఒక్కో ఉద్యోగికి ప్రభుత్వం నుంచి రూ. 20 వేల నుంచి రూ. 25 వేల వరకు జీతం కింద డ్రా చేసిన ఆ ఏజెన్సీ నిర్వాహకులు.. క్షేత్రస్థాయిలో మాత్రం కేవలం రూ. 13 వేల నుంచి రూ. 16 వేలు మాత్రమే చెల్లించి మిగతా మొత్తాన్ని నొక్కేశారు. ఇలా నాలుగేళ్ల కాలంలో జీతాల రూపంలో ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో దాదాపు 40 శాతం వరకు అంటే సుమారు రూ. 400 కోట్లను అక్రమంగా దారి మళ్లించినట్లు గుర్తించారు. దీనికి తోడు ఉద్యోగుల ESI, PF, GST రూపంలో చెల్లించాల్సిన మరో రూ. 100 కోట్లను కూడా ఎగవేసి పెద్దఎత్తున మోసానికి పాల్పడ్డారు.

ఈ మొత్తం అక్రమ వసూళ్ల వెనుక ప్రధానంగా అప్పట్లో చక్రం తిప్పిన పెద్దల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. రాయచోటికి చెందిన ఆ ఏజెన్సీ నిర్వాహకుడు తాడేపల్లి ప్యాలెస్‌కు అతి సమీపంలో విలాసవంతమైన భవనంలో ఉంటూ ఈ దందాను నడిపించినట్లు సమాచారం. ఈ స్కామ్ ద్వారా దోచుకున్న సొమ్ములో సింహభాగం నాటి కీలక నేతలకు, అధికారులకు చేరినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Related posts

నేపాల్ వరదల్లో వందలాది మందిని కాపాడిన దేవత

Satyam News

గ్రామీణ వ్య‌వ‌స్థ బ‌లోపేత‌మే విబి జి రామ్‌జి ప‌థ‌క లక్ష్యం

Satyam News

“తల తిరుగుడు” కు అత్యాధునిక వైద్య చికిత్సలు

Satyam News

బ్రిటన్ తో వాణిజ్య ఒప్పందం నేటి నుంచి అమలు

Satyam News

ధాన్యం ఉత్పత్తిలో చైనాను అధిగమించిన భారత్

Satyam News

ముంబైలో ఘోరం: గాల్లో ఆగిపోయిన మోనోరైళ్లు

Satyam News

Leave a Comment