ఆధ్యాత్మికంహోమ్

కూపుచంద్రపేటలో ఫిబ్రవరి 2న స్నపన తిరుమంజనం

#Tirumala

తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలోని స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఫిబ్రవరి 2వ తేదీన కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు. శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులు ఉదయం 6 గంటలకు ఆలయం నుండి ఊరేగింపుగా బయల్దేరి తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలో గల కూపుచంద్రపేటకు ఉదయం 9.30 గంటలకు చేరుకుంటారు.

అనంతరం స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు ఊంజ‌ల్ సేవ‌, సాయంత్రం 5 గంట‌లకు గ్రామోత్స‌వం నిర్వ‌హించి, తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ప్రతి సంవత్సరం మాఘమాసం పౌర్ణమి సందర్భంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఉదయం, సాయంత్రం జరిగే స్వామివారి ఊరేగింపులో టీటీడీ హిందూధర్మ ప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

Related posts

హిజాబ్ పై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇదే…

Satyam News

స‌ర్ విజ్జీ స్టేడియంను ప‌రిశీలించిన గోవా గ‌వ‌ర్న‌ర్

Satyam News

నాగర్ దొడ్డి గ్రామ వాసికి డాక్టరేట్

Satyam News

ఏపీ లిక్కర్ గ్యాంగ్ తో విజయ్ చెట్టాపట్టాల్.!

Satyam News

వయోజన టీకాల ప్రాముఖ్యతపై అవగాహన

Satyam News

₹ 1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

Satyam News

Leave a Comment