ప్రత్యేకంహోమ్

గొడ్డలి పార్టీ వల్ల ఆగిన ఉత్తరాంధ్ర అభివృద్ధి

#Uttarandhra

గొడ్డలి పార్టీతో ఉత్తరాంధ్ర అభివృద్దిపై వేటు పడిందని, ప్రజా ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర నుంచి వలసలు వెళ్లకుండా ఉత్తరాంధ్రకే వలసలు వచ్చేలా సంకల్పం తీసుకున్నామని  ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర తో పాటు రాయల సీమ కోస్తా జిల్లాల అభ్యర్థులు అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

రోజుకు ఓ డ్రామాతో వచ్చే వారితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మళ్లీ రాష్ట్రంలో వైకుంఠపాళి వద్దని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని తామ్రపల్లిలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ప్రజా వేదిక సభలో పాల్గొని ముఖ్యమంత్రి ప్రసంగించారు.

“రాష్ట్రం పరిశుభ్రంగా ఉండాలనే సంకల్పంతోనే  స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టాం. స్వచ్ఛపథం కార్యక్రమంలో భాగంగా గ్రామీణ అర్బన్ ప్రాంతాల్లోని రహదారులను శుభ్రపరిచేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ప్రతినెలా ఒకటో తేదీన పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొని అర్హులకు స్వయంగా పింఛన్లు అందించడం ద్వారా ఎంతో ఆనందం కలుగుతోంది.

పేదరికం లేని సమాజం , ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. జనాభా తగ్గుదల ఆందోళన కలిగిస్తోంది.  పిల్లలే సంపద అని పిలుపునిస్తున్నాను. అందుకే మూడు, నాలుగో సంతానానికి ప్రోత్సాహకం అందించేలా నిర్ణయం తీసుకుంటున్నాం.

మూడో సంతానానికి 30 వేలు, నాలుగో సంతానానికి 40 వేలు ప్రోత్సాహకం ఇస్తాం.  అంగన్వాడీలను బలోపేతం చేస్తున్నాం. తల్లికి వందనం కింద రూ. 15 వేలు ఆర్థిక సాయం చేస్తున్నాం. రీ సర్వే ద్వారా భూముల రికార్డులు ప్రక్షాళన చేస్తున్నాం.

ఎవరూ ట్యాంపరింగ్ చేసే అవకాశం లేకుండా ఆధునిక టెక్నాలజీని వినియోగించి పట్టదారు పాస్ పుస్తకాలను ముద్రించి అందిస్తున్నాం. 2027 మార్చి నాటికి రాష్ట్రంలో ఎక్కడా భూ తగాదాలు లేకుండా చేసే బాధ్యత తీసుకుంటామని” ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

సగర్వంగా స్వచ్ఛత వైపు అడుగులు

“17 నెలలుగా మనం స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేస్తున్నాం. పరిసరాలు, పరిశుభ్రత విషయంలో మార్పు కనిపిస్తోంది. మన ఆలోచనలు స్వచ్ఛంగా ఉంటే మన అలవాట్లు మారుతాయి.

అలవాట్లు మారితే సమాజం మారుతుంది. సమాజం మారితేనే స్వచ్ఛాంధ్ర సాకారం అవుతుంది.  2047 నాటికి స్వర్ణాంధ్ర సాధన లక్ష్యంతో పనిచేస్తున్నాం. ప్రస్తుతం మన తలసరి ఆదాయం రూ. 3 లక్షలు. దీన్ని రాబోయే 22 ఏళ్లలో రూ. 54 లక్షలు చేయాలనే దిశగా ముందుకెళ్తున్నాం.

పేదలను ఆర్థికంగా ఆదుకునేందుకు పీ4 తీసుకొచ్చాం. పైన ఉండే 10 శాతం మంది కింద ఉండే 20 శాతం మందిని ఆర్థికంగా పైకి తీసుకు రావాలి. 2047 నాటికి మనదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలుస్తుంది. ఆ దిశగా ప్రదాని మోదీ ముందుకెళ్తున్నారని” సీఎం చంద్రబాబు అన్నారు.

Related posts

శాంతి నగర్ లో ఘనంగా గో పూజ

Satyam News

21వ శతాబ్దంలో మానవవాదం పుస్తకావిష్కరణ

Satyam News

వ‌న‌స్థ‌లిపురం పీఎస్ లో సినీ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ పై ఫిర్యాదు

Satyam News

జగన్‌ జీరో.. పట్టించుకోని రేవంత్‌, కేటీఆర్‌..!!

Satyam News

రామాలయ నిధులు కొట్టేసింది విశ్వ హిందూ పరిషత్?

Satyam News

ఏపీకి రష్యన్ టెక్నాలజీ…… పెట్టుబడుల వేటలో లోకేశ్ స్మార్ట్ స్కెచ్!

Satyam News

Leave a Comment