కడపహోమ్

మృతుని కుటుంబానికి అండగా నిలిచిన మాధవి రెడ్డి

#Madhavireddy

శ్రీరామ శోభయాత్రలో దురదృష్టవశాత్తు మృతి చెందిన హరి కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయాన్ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మాధవి రెడ్డి అందచేశారు. కడప నగరంలో జరిగిన శ్రీరామ శోభయాత్ర సందర్భంగా దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన హరి కుటుంబానికి శ్రీరామ అయోధ్య ఆలయ కమిటీ మరియు స్థానిక నేతలు అండగా నిలిచారు.

హరి నివాసానికి వెళ్లిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, ఆలయ కమిటీ తరపున ప్రకటించిన రూ. 10 లక్షల ఆర్థిక సాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆర్థిక సాయంగా మొత్తం రూ. 10 లక్షలలో, రూ. 5 లక్షలను భవిష్యత్తు అవసరాల కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) చేయగా, మిగిలిన రూ. 5 లక్షలను నగదు రూపంలో తక్షణ అవసరాల కోసం అందజేశారు.

ఉపాధి భరోసాగా హరి భార్యకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. హరి పిల్లల చదువు బాధ్యతను స్వీకరించేందుకు కడప నగరంలోని మూడు ప్రముఖ పాఠశాలల యాజమాన్యాలు ముందుకు వచ్చాయని, వారు ఉచితంగా విద్యను అందిస్తారని నాయకులు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హరి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, వారికి ఏ కష్టం వచ్చినా చూసుకుంటాం అని భరోసా ఇచ్చారు.

అయోధ్య ఆలయ కమిటీ మరియు విద్యాసంస్థల యాజమాన్యాలు చూపిన ఈ మానవత్వాన్ని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Related posts

పరవాడ లో మళ్లీ గ్యాస్ లీక్

Satyam News

ఏపీలో భారీగా పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు

Satyam News

శ్రీశైలానికి కాలినడకన చేరుకున్న కర్ణాటక భక్తులు

Satyam News

రూ.20 లక్షలతో పానీపూరీ వ్యాపారి పరార్!

Satyam News

పురుషుడిలో స్త్రీ లక్షణాలు: గుంటూరు లో అరుదైన వ్యాధి

Satyam News

ఒరిస్సాలో ఉపరితల ఆవర్తనంతో మారిన వాతావరణం

Satyam News

Leave a Comment