ఆధ్యాత్మికంహోమ్

కల్పవృక్ష వాహనంపై కటాక్షించిన శ్రీ సౌమ్యనాథస్వామి

#KalpavrukshaVahanam

నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో నాలుగో రోజైన శనివారం ఉదయం శ్రీ సౌమ్యనాథస్వామివారు దివ్యమైన కల్పవృక్ష వాహనంపై విహరిస్తూ భక్తులకు అనుగ్రహం ప్రసాదించారు. గోవింద నామస్మరణ, చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ సాగిన వాహనసేవ భక్తి పారవశ్యాన్ని నింపింది. అడుగడుగునా భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామివారి దివ్య మంగళదర్శనం పొందారు.

పురాణాల ప్రకారం కల్పవృక్షం కోరుకున్న కోర్కెలన్నింటినీ నెరవేర్చే దివ్య వృక్షంగా ప్రసిద్ధి చెందింది. ఆ కల్పవృక్ష వాహనంపై విహరించిన శ్రీ సౌమ్యనాథస్వామివారు భక్తులందరికీ సకల ఐశ్వర్యాలు, శుభఫలితాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆశీర్వదిస్తున్నారనే భావనతో భక్తులు విశేష భక్తిశ్రద్ధలతో వాహనసేవలో పాల్గొన్నారు.

జూలై 26న ఉదయం శేష వాహనంపై, రాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవంగా నిర్వహించే గరుడ వాహనంపై శ్రీ సౌమ్యనాథస్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

Related posts

తప్పుడు ప్రచారం చేస్తే తోలు తీస్తాం

Satyam News

జాతీయ సగటును దాటిన రాష్ట్ర వృద్ధి రేటు

Satyam News

పాలపిట్ట దర్శనం శుభసూచకం

Satyam News

ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు: ఆరు జిల్లాల్లో వారం రోజుల వేడుకలు

Satyam News

దళితవాడల్లో టీటీడీ ఆలయాలు

Satyam News

గంజాయి సాగు ఆపడానికి ఇక పల్లెల్లో ఈగల్

Satyam News

Leave a Comment