గుంటూరుహోమ్

మంత్రి నారా లోకేష్ సహకారంతో రంజాన్ తోఫా

#RamzanThofa

మంత్రి నారా లోకేష్ సహకారంతో మంగళగిరి నియోజకవర్గంలోని మసీదులలో ఉన్న 180 మంది ఇమామ్, మౌజన్, హఫీస్ లకు రంజాన్ తోఫాను టీడీపీ నాయకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంను పట్టణంలోని జామీయా మసీదు వద్ద గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, మైనార్టీ నాయకులు మాట్లాడుతూ ముస్లింలకు రంజాన్‌ పర్వదినాలు ఎంతో ప్రాముఖ్యమైనవని, ఉపవాస దీక్ష అనేది కేవలం అల్లా అనుగ్రహం కోసమే కాదని, సమాజంలో సోదర భావం, ఐకమత్యం, దయాగుణం, ప్రేమ పెంపొందించేందుకు దోహదపడతాయన్నారు. మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో నియోజకవర్గంలోని అన్ని మసీదులలో ఉన్న ఇమామ్, మౌజన్, హఫీస్ లకు రంజాన్ తోఫా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

గత ఐదు సంవత్సరాల నుంచి మంత్రి నారా లోకేష్ సహకారంతో రంజాన్ తోఫా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. మంత్రి నారా లోకేష్ నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ముస్లింలను పూర్తిగా విస్మరించడంతో పాటు వారిని ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, ముస్లీం పెద్దలు పాల్గొన్నారు.

Related posts

రేపు దేశవ్యాప్తంగా BSNL 4జీ సేవలు ప్రారంభం

Satyam News

జులై 1 నుంచి వీబీజీ రామ్‌జీ పథకం అమలు

Satyam News

వైజాగ్ రైల్వే స్టేషన్‌లో ‘నకిలీ’ నోట్ల కలకలం

Satyam News

పులివెందులలో వార్‌ వన్‌ సైడ్‌… జగన్‌ అభ్యర్ధికి డిపాజిట్‌ గల్లంతు…!!

Satyam News

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

Satyam News

అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రాకు మద్దతు… ఇప్పుడు విమర్శలు

Satyam News

Leave a Comment