తూర్పుగోదావరిహోమ్

కాకినాడలో “స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర”

#KakinadaPolice

“స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర” కార్యక్రమంలో నేడు కాకినాడ జిల్లా పోలీసులు పాల్గొన్నారు.  ఏ ఆర్ పోలీస్ క్వార్టర్స్ వద్ద జరిగిన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ముఖ్యఅతిధిగా విచ్చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర” కార్యక్రమంలో భాగంగా శనివారం కాకినాడ జిల్లా వ్యాప్తంగా పోలీసు స్టేషన్ ల లో ఆయా స్టేషన్ సిఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా పోలీసు ప్రధాన కేంద్రమైన కాకినాడలో జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ ఏ ఆర్ క్వార్టర్స్ ప్రాంతంలో   స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణాంధ్ర  కార్యక్రమంలో పాల్గొని, మొక్కను నాటి, అక్కడి పరిసరాలను పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

అనంతరం జిల్లా ఎస్పీ సిబ్బంది మరియు అధికారులతో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించి,  పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి శ్రమదానంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (ఏ ఆర్) S. శ్రీనివాసరావు, ఎస్బి డిఎస్పీ కెవివి సత్యనారాయణ, డిఎస్పీ (ఏ ఆర్) వి జి శ్రీహరి రావు, MT రిజర్వ్ ఇన్స్పెక్టర్ కె వెంకటరావు, కంపెనీ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎమ్ నరసింహ మూర్తి,  కాకినాడ టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఎం అప్పలనాయుడు,  పోర్ట్ ఇన్స్పెక్టర్ పి సునీల్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

అడ్వకేట్స్‌ కు జుడీషియల్‌ అకాడమి పెట్టాలి

Satyam News

సిఎస్ గా బాధ్యతలు స్వీకరించిన సాయి ప్రసాద్

Satyam News

యోగాతో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత

Satyam News

హైకోర్టు ఇలా చెబుతుందని అనుకోలేదు

Satyam News

4 ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు  ప్రతిపాదనలు

Satyam News

గల్ఫ్ దేశాల డేటా సెంటర్లను టార్గెట్ చేసిన ఇరాన్?

Satyam News

Leave a Comment