సంపాదకీయంహోమ్

వామ్మో జగన్‌… ఆ సర్వేలో సంచలన నిజాలు…!!

#jagan

తెలుగుదేశం పార్టీ ప్రజల అభిప్రాయాలకు ఫస్ట్‌ ప్రయారిటీ ఇస్తుంది. భారీ మెజారిటీతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయింది. ఈ సమయంలో ప్రజల ఆలోచనల్లో ఎలాంటి మార్పులు వచ్చాయనే విషయంపై అంతర్గత సర్వే నిర్వహించారట.

అధికార కూటమి మీద పబ్లిక్‌ ఒపీనియన్‌ ఎలా ఉంది.. అపోజిషన్‌లోకి వెళ్లిన వైఎస్ జగన్‌పై జనాలు ఏమనకుంటున్నారో తెలుసుకొనే ప్రయత్నం చేశారు. ఈ సర్వేలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఏమాత్రం తగ్గలేదని తెలిసింది.

అయితే వైసీపీ అధినేత జగన్‌రెడ్డి విషయంలో పబ్లిక్‌ ఒపీనియన్‌.. టీడీపీ నాయకత్వానికి ఆశ్చర్యంతో పాటు… ఆనందాన్ని కలిగించిందని తెలుస్తోంది. వైఎస్ జగన్‌ పేరు చెబితే ఆంధ్రప్రదేశ్‌లో మెజారిటీ ప్రజలు ఇప్పటికీ భయపడుతున్నారట.

దాదాపు 60 శాతం మంది ప్రజలు.. జగన్‌ పాలన అంటే దౌర్జన్యాలు, దాడులే గుర్తుకొస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా నాలుగు అంశాల్లో జగన్‌ అంటే భయం వ్యక్తం చేస్తున్నారు. వీటిలో మొదటిది అమరావతి.. మళ్లీ జగన్‌ వస్తే.. రాజధానిని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తారని ఏపీలో మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు.

లిక్కర్‌, ఇసుక వంటి అంశాల్లో జగన్‌ మళ్లీ గత విధానాలే తీసుకొస్తారని.. ఎక్కువ మంది ఒపీనియన్. ప్రతిపక్షంలో ఉండగానే రప్పా రప్పా అని రెచ్చిపోతున్న.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు.. మళ్లీ అధికారంలోకి వస్తే.. వాళ్ల దౌర్జన్యాలను తట్టుకోలేమని అత్యధిక శాతం ప్రజలు భయపడుతున్నారు.

రివర్స్‌ టెండర్లు, పరిశ్రమలను తరిమేయడం వంటి నిర్ణయాలతో ఏపీ అభివృద్ధిని రివర్స్‌ చేస్తారనే ఆందోళన చాలా మందిలో కనిపిస్తోంది. ఈ కారణాలతో ప్రజల్లో జగన్‌ పేరు చెబితే.. ఒకప్పుడు కలిగే అభిమానం, సానుభూతి లాంటి ఫీలింగ్స్‌ని భయం, ఆందోళన రీప్లేస్‌ చేశాయని తెలుస్తోంది.

మెజారిటీ ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవడం.. జగన్‌ వ్యవహార శైలి మీదే ఆధారపడి ఉంటుంది. ఈ మధ్య పబ్లిక్‌ మీటింగులు, ప్రెస్‌ మీట్‌లలో జగన్‌ ప్రసంగాలు విన్న వాళ్లు… ఈయనకు ఇంకా తగ్గలేదు అనే అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. ఏది ఏమైనా.. జగన్‌ ఇంకో పదిహేనేళ్లు ఇలాగే ఉండాలని.. టీడీపీ నాయకత్వం కోరుకుంటే… ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

Related posts

తెలంగాణ పర్యాటక సంస్కరణలకు నీతి ఆయోగ్ ప్రశంస

Satyam News

వీబీజీ రామ్ జీ పథకం ప్రారంభించిన చంద్రబాబు

Satyam News

లైవ్ లో క్షిపణి దాడి… ఓ మై గాడ్..

Satyam News

మే 15 లోపు మెడికల్ కాలేజీ పనులు పూర్తి

Satyam News

బార్ పెట్టాలంటే భయపడక్కరలేదు!

Satyam News

జొన్నగిరి బంగారంతో కొత్త ఆశలు

Satyam News

Leave a Comment