ప్రత్యేకంహోమ్

దేవ దేవుడితో రాజకీయాలు చేస్తున్న బొత్స

#KimidiNagarjuna

ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు, ఆ పార్టీ ఎమ్మెల్సీలకు రాజీనామా చేసే దమ్ము ఉందా? అని విజయనగరం జిల్లా టిడిపి అధ్యక్షులు , డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున ప్రశ్నించారు. హిందుత్వమన్నా, హిందువుల మనోభావాలన్నా వైకాపా వారికి ఏ మాత్రం గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డూ నాణ్యత తగ్గడం, దేవాలయాలపై దాడులు జరగడం, టీటీడీ చైర్మన్ల వివాదాస్పద వ్యాఖ్యలు, కౌన్సిల్లో దేవుడికి కనీస గౌరవం కూడా ఇవ్వకపోవడం వంటి విషయాలు చర్చనీయాంశంగా ఉన్నాయని చెప్పారు.

శనివారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ, ఎమ్మెల్యే లోకం మాధవి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌వర్మలతో కలసి నిర్వహించిన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా నాగార్జున మాట్లాడుతూ రాజశేఖరరెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా తిరుపతిని, వెంకన్న స్వామిని వారు ఎప్పుడూ చిన్నచూపు చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ‘తిరుపతికి వెళ్లిన ఒక సగటు భక్తుడిని అడిగినా చెబుతారు.. స్వామి వారి లడ్డూ ప్రసాదం టీడీపీ హయాంలో ఎంత నాణ్యతగా ఉండేదో?

వైకాపా ఉన్నప్పుడు ఎలా ఉందో? వైకాపా పాలనలో లడ్డూ నాణ్యత విషయంలో ప్రతి భక్తుడూ ఆందోళన చెందాడ’ని గుర్తు చేశారు. సుమారు 150 ఆలయాల మీద వైకాపా హయాంలో దాడి జరిగిందని చెప్పారు. రామతీర్థంలో రాముడి విగ్రహం శిరస్సును తీసేశారని.. ఆ సమయంలో వారు ఎటువంటి ప్రకటనలిచ్చారో అందరికీ తెలుసన్నారు. వీరు టీటీడీ చైర్మన్లుగా ఎవరినైతే నియమించారో.. వారంతా ఏదో సందర్భంలో వెంకటేశ్వర స్వామి మీద తప్పుగా మాట్లాడిన ఉదంతాలున్నాయని గుర్తు చేశారు.

తిరుపతి లడ్డూను ఎవరిచ్చినా.. దేవుడి క్యాలెండరును అందించినా.. చెప్పులు తీసేసి మరీ అందుకుంటామని తెలిపారు. కుర్చీలో కూర్చొన్నామంటే, లేచి నిల్చొని ఆ ప్రసాదం తీసుకుంటామన్నారు. ‘కౌన్సిల్‌లో వైకాపా ఎమ్మెల్సీలు ఏం చేశారు.. చెప్పులు, బూట్లతో స్వామి వారి చిత్రపటాన్ని పట్టుకున్నారు. దేవుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. కనీస గౌరవ మర్యాదలు లేకుండా ప్రవరిస్తున్నార’ని ఆందోళన వ్యక్తం చేశారు.

అబద్ధాలను నిజం చేయడంలో బొత్స దిట్ట

అబద్ధాలను నిజం చేయడంలో ఆయన దిట్ట అని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణను ఉద్దేశించి నాగార్జున విమర్శించారు. ‘ఎవరైనా కొత్తగా ఆయన మాటలు వింటే.. నిజమని భ్రమిస్తారు. అంత కన్విన్స్ చేసేలాగా మాట్లాడతారు. 2004 నుంచి విజయనగరం ప్రజలందరికీ తెలుసు. ఈ రోజున కౌన్సిల్‌లో అదే బయటికి వచ్చింద’ని తెలిపారు.

ఒక్క వీడియో ఉంటే చూపించండి.. ఒక్క ఫొటో ఉంటే చూపించండని చెబుతున్న బొత్సకు.. కౌన్సిల్‌లో అన్నీ రికార్డవుతాయని సంగతి మర్చిపోయారా? అని ఎద్దేవా చేశారు. ‘బొత్స సత్యనారాయణను సూటిగా అడుగుతున్నాం.. మీ ఎమ్మెల్సీలంతా కౌన్సిల్‌లో చేసిన రాద్ధాంతం ఏమిటనేది కనిపించింది కదా? ఇప్పుడు మీరంతా రాజీనామాలు చేస్తున్నారా, చేయట్లేదా?’ అని ప్రశ్నించారు.

‘తిరుపతిని గానీ, వెంకన్న స్వామిని గానీ.. రాష్ట్రంలో ఉన్న దేవాలయాలను, దేవుళ్లను గానీ చూసుకునే బాధ్యత తెదేపాది. ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉండేలా మేం చూసుకుంటాం. అన్ని మతాల వారి మనోభావాల్ని కాపాడే బాధ్యత మా కూటమి ప్రభుత్వానిద’ని స్పష్టం చేశారు.

కౌరవ సభగా మార్చేస్తున్నారు : ఎమ్మెల్యే లోకం మాధవి

జగన్ అండ్ కోకు హిందూ దేవాలయాలన్నా, హిందువులన్నా అసలు గౌరవం లేదని ఎమ్మెల్యే లోకం మాధవి అన్నారు. అప్పట్లో నెల్లిమర్ల నియోజకవర్గం రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసి, హిందువుల మనోభావాలపై దెబ్బ కొట్టారని గుర్తు చేశారు. తాజాగా శాసనమండలిలో చేసిన విధ్వంసాన్ని అందరూ చూశారని తెలిపారు. లడ్డూ కల్తీ పాపాన్ని కూటమి ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. గౌరవసభను కౌరవ సభగా మార్చేశారని తెలిపారు. వైకాపా మనుగడ సాగించాలంటే జగన్ అండ్ కో నేతల తీరు మారాలన్నారు.

బొత్స మాట్లాడినవి అన్ని అబద్ధాలే : ఎమ్మెల్సీ గ్రీష్మ

వైకాపా నేతల పిచ్చి పరాకాష్టకు చేరిందని ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ అన్నారు. చెప్పులేసుకుని వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని పట్టుకుంటారా? అని ప్రశ్నించారు. ‘కౌన్సిల్‌లో ప్రత్యక్షంగా చూస్తున్నాం.. వారు చేస్తున్న రచ్చ చూస్తుంటే ఆవేదనగా ఉంది. సభా సమయాన్ని వృథా చేస్తున్నారు. కనీస సభా మర్యాదలు పాటించడం లేద’ని తెలిపారు. బొత్స సరిగ్గా మాట్లాడలేరని.. మాట్లాడినా అన్నీ అబద్ధాలేనని విమర్శించారు.

తిరుపతికి వస్తే జగన్ ఎప్పుడైనా డిక్లరేషన్ ఇచ్చారా? అబ్దుల్ కలాం కంటే ఆయన గొప్పవాడా? అని ప్రశ్నించారు. లడ్డూలో కల్తీ జరిగిందని స్వయంగా వై.వి.సుబ్బారెడ్డి ఒప్పుకున్న విషయాన్ని గుర్తు చేశారు. చీజ్ ప్యాకెట్‌ను పట్టుకుని, బొత్స నెయ్యి అంటారని విమర్శించారు. సభలో పనికి వచ్చే విషయాల మీద చర్చించడం మానేసి.. వ్యూహాత్మకంగా పక్కదోవ పట్టించేలా రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘స్వామి వారిని రాజకీయాలకు వాడొద్దు.. మగవారికి ఎలానూ తెలియదనుకుందాం.. కల్పలత, వరుదు కల్యాణి వంటి మహిళలూ ఉన్నారు. తెల్లవారి లేచి దీపాలు పెట్టుకుంటాం.. పూజలు చేస్తాం. వారికేమైంది? అని ప్రశ్నించారు.

బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ వర్మ మాట్లాడుతూ.. దేవదేవుడు శ్రీనివాసుడిని కూడా రాజకీయాల్లోకి వాడుకునే నీచస్థాయికి వైకాపా నేతలు దిగజారారని విమర్శించారు. జగన్‌కు, ఆ పార్టీ నేతలకు దేవుడంటే భయం, భక్తి లేదని తెలిపారు. హిందువుల మనోభావాలంటే లెక్కే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు ప్రసాదుల  ప్రసాద్, కనకల మురళి, గంటా రవి,అల్తి బంగారు బాబు, పాసి అప్పలనాయుడు, మైలపల్లి పైడి రాజు, పొగిరి పైడిరాజు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

అనంతగిరిలో ‘సంఘటన్ సృజన్ అభియాన్’

Satyam News

సిసి రోడ్డు పనులను ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్

Satyam News

మానవహక్కుల మండల్ ఉపాధ్యక్షుడిగా చించొలే

Satyam News

మీరట్ లో ఘోర ప్రమాదం: 5 గురు చిన్నారులు మృతి

Satyam News

భార్యపై భర్త అమానుష దాడి

Satyam News

#TeamIndia: అణు క్షిపణులు తీసుకెళ్లే జలాంతర్గామి సిద్ధం

Satyam News

Leave a Comment