సినిమాహోమ్

“జిందగీ ఇన్ టూ షేడ్స్” ఫిల్మ్ మేకర్’గా డాలి టోమర్’కి ఉజ్వల భవిష్యత్

#Zindagi

“ఇఫ్తేకర్ షరీఫ్” జీవితం ఆధారంగా తీసిన డాక్యుమెంటరీ “జిందగీ ఇన్ టూ షేడ్స్” హైదరాబాద్‌లో ప్రీమియర్‌ అయింది. ఈ ప్రదర్శనకు ప్రేక్షకుల నుంచి, వచ్చిన అతిథుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ కార్యక్రమానికి వచ్చిన మాజీ భారత క్రికెటర్, తెలంగాణ మైనారిటీ వ్యవహారాల మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ సినిమా చూసి ప్రశంసించారు.

నిజ జీవిత కథను చాలా నిజాయితీగా, సింపుల్‌గా చూపించారని, ఇందులో మంచి సామాజిక సందేశం ఉందని అన్నారు. డాలి టోమర్ నుంచి ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని కోరారు. ఫిల్మ్ మేకర్ గా ఆమెకు ఉజ్వల భవిష్యత్ ఉందని కొనియాడారు.

ఈ డాక్యుమెంటరీని ముంబయికి చెందిన ఓమ్‌షీల్ ప్రొడక్షన్స్ (డాలీ టోమర్) నిర్మించగా, అమెరికాలోని డీకే ఒమ్‌షీల్ ప్రొడక్షన్స్ (ఖుర్రం సయ్యద్) సహకరించింది. సినిమాకు దర్శకత్వం రజనీష్ దూబే, నిర్మాణం కల్పనా రాజ్‌పుత్, ఎడిటింగ్ దేవు నామ్‌దేవ్ చేశారు.

“జిందగీ ఇన్ టూ షేడ్స్” మన జీవితాల్లో ఎదురయ్యే నిజాల్ని సూటిగా చూపించే డాక్యుమెంటరీ. ఇప్పటికే ఇది అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ దృష్టిని కూడా ఆకర్షిస్తోంది. సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ ఈ ఈవెంట్’ను కోఆర్డినేట్ చేశారు. మొత్తానికి, మంచి కంటెంట్‌తో, మంచి సందేశంతో “జిందగీ ఇన్ టూ షేడ్స్” ప్రేక్షకుల మనసుల్లో చోటు దక్కించుకుంటోంది.

Related posts

జగన్‌కు బిగ్‌షాక్…10,700 ఎకరాల బ్రాహ్మణి స్టీల్స్ భూములు సీజ్!

Satyam News

అణు పరీక్షలకు సిద్ధమైన పాకిస్తాన్?

Satyam News

‘తలసేమియా వ్యాధిపై’ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

Satyam News

సొంత ప్రభుత్వంపై ‘రాములమ్మ’ నిప్పులు!

Satyam News

రేపటిలోగా డీజిల్, పెట్రోల్ సప్లయ్ పెరగాలి

Satyam News

U Turn: మళ్లీ మాట మార్చిన అమెరికా అధ్యక్షుడు

Satyam News

Leave a Comment