గుంటూరుహోమ్

నరసరావుపేటలో “ఆవో ఉర్దూ సీఖే “

#Dr.AravindBabu

రాష్ట్రంలో ఉర్దూ భాషాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని పల్నాడు జిల్లా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో నరసరావుపేట 15వ వార్డులో ఆవో ఉర్దూ సీఖే …. రండి ఉర్దూ నేర్చుకుందాం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచిత ఉర్దూ మెటీరియల్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు చేతుల మీదుగా విద్యార్థులకు, ఔత్సాహికులకు ఉర్దూ పుస్తకాలను పంపిణీ చేశారు. ఉర్దూ భాష నేర్చుకోవడం ద్వారా సాంస్కృతిక ఐక్యత పెరుగుతుందని, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు.

ఉర్దూ అకాడమీ ద్వారా ఉచితంగా అందిస్తున్న ఈ పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ ఫిరోజ్, పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, అంజుమన్ కమిటీ సభ్యులు, మత పెద్దలు పాల్గొన్నారు.

Related posts

తల్లికి వందనం: ఈ నెల 22న తల్లుల ఖాతాల్లోకి రూ.10 వేల కోట్లు!

Satyam News

చంద్రబాబు కారు తో దిక్కుమాలిన రాజకీయం

Satyam News

మధ్యప్రదేశ్ లో ఇక యూనిఫామ్ సివిల్ కోడ్

Satyam News

శ్రీ గురు రాఘవేంద్ర స్వామి విశేష పంచామృతాభిషేకం

Satyam News

వెలుగుమట్ల బాధితుల కోసం కొనసాగుతున్న దీక్ష

Satyam News

అంతర్జాతీయ పెట్టుబడులను భారీగా ఆకర్షించేలా ప్రణాళిక

Satyam News

Leave a Comment