ప్రకాశంహోమ్

వెలిగొండతో రూపురేఖలు మారనున్న మార్కాపురం

#Gottipati

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధిలో చరిత్ర సృష్టించాలన్నా.. గత చరిత్రను తిరగరాయాలన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే సాధ్యమని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. వెనుకబడిన మార్కాపురం ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయడంతో పాటు హార్టికల్చర్‌ హబ్‌లో చేర్చడం, వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభించే స్థాయికి తీసుకురావడం చంద్రబాబు నాయుడు నాయకత్వం లోనే సాధ్యమైందని పేర్కొన్నారు.

మార్కాపురం జిల్లా ప్రజలు మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కల సాకారం కానుందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరగనుందని చెప్పారు. ఈ ప్రాంత ప్రజలకు ఇది ఒక చారిత్రక ఘట్టమని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు.

ప్రతిపక్షంలో ఉండగానే నికర జలాల కోసం పోరాటం

వెలిగొండ ప్రాజెక్టుకు నికర జలాలు సాధించేందుకు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఢిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చామని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు. ప్రాంతీయ ప్రజల ప్రయోజనాల కోసం అప్పట్లో చేసిన పోరాటం ఫలించిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల నిర్వహణను సైతం పట్టించుకోలేదని విమర్శించారు.

జగన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిందని, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ, గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు దెబ్బతిన్నాయని ఆరోపించారు. ప్రాజెక్టుల నిర్వహణపై నిర్లక్ష్యం వహించిన వైసీపీ నేతలకు వెలిగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు.

కరువు ప్రాంతాల్లోకి నీరు.. కొత్త చరిత్ర

కొండలను బద్దలు కొట్టి కరువు ప్రాంతాల్లో నీరు పారించిన చరిత్ర చంద్రబాబుదేనని మంత్రి పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తవడంతో మార్కాపురం ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక పరిస్థితులు, వ్యవసాయ రంగం రూపురేఖలు మారనున్నాయని తెలిపారు. వెలిగొండ నిర్వాసితులకు కేవలం 48 రోజుల్లో రూ.768 కోట్ల పరిహారం అందించడం రికార్డుగా నిలిచిందన్నారు.

నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిందని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభంతో ప్రకాశం జిల్లాలోని కరువు పీడిత ప్రాంతాలకు సాగు, తాగునీటి భద్రత మరింత బలోపేతమవుతుందని మంత్రి తెలిపారు. ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతంలో వ్యవసాయం, ఉద్యానవనం, ఉపాధి అవకాశాలు పెరిగి మార్కాపురం ప్రాంత అభివృద్ధికి కొత్త దిశ ఏర్పడుతుందని పేర్కొన్నారు.

మూడు దశాబ్దాలుగా మార్కాపురం ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్న కల సాకారం అవుతున్న వేళ.. వెలిగొండ ప్రారంభోత్సవం చరిత్రలో నిలిచిపోయే ఘట్టంగా మారనుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు.

Related posts

దేవదేవుడికి అపచారం చేశాం: రోజా, జోగి టాక్ లీక్

Satyam News

సూపర్ స్మార్ట్ సిటీ గా నల్గొండ

Satyam News

ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ గా ఎమ్మెల్సీ నాగబాబు

Satyam News

రథసప్తమి రోజు చేయాల్సింది ఏమిటి?

Satyam News

నేపాల్ లో ఆగని ఆందోళనలు: ముదిరిన రాజకీయ సంక్షోభం

Satyam News

పురుషుడిలో స్త్రీ లక్షణాలు: గుంటూరు లో అరుదైన వ్యాధి

Satyam News

Leave a Comment