25.2 C
Hyderabad
September 20, 2026
మహబూబ్ నగర్హోమ్

ఘనంగా వనపర్తి జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రమాణ స్వీకారం

#MeghaReddy

వనపర్తి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు కొత్త కాపు శివసేన రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ముఖ్యంగా హాజరై, డీసీసీ అధ్యక్షుడికి శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ, “కలిసి పని చేద్దాం… కాంగ్రెస్ పార్టీ జెండాను రాష్ట్రంలో ఎగరేద్దాం. బేషీజాలు వద్దు, పార్టీ పటిష్టతే మన లక్ష్యం. అవసరమైతే నాలుగు అడుగులు దిగైనా సరే నా అన్నవాళ్ల కోసం పని చేస్తాం” అని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీ పని అయిపోయిందని, కుటుంబ కుమ్ములాటల వల్ల ఆ పార్టీ కూలిపోవడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు.

నూతన డీసీసీ కార్యాలయం నుంచి కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీగా బయలుదేరి ఇందిరాపార్క్, రాజీవ్ చౌరస్తా మీదుగా అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడ మాజీ రాజ్యసభ సభ్యులు వి. హనుమంతరావుతో కలిసి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం అంబేద్కర్ చౌరస్తా నుంచి ర్యాలీగా బయలుదేరి దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆప్కారి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

సమావేశంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, అలాంటి అంపశయ్యపై ఉన్న పార్టీ నాయకులు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో వనపర్తి నియోజకవర్గానికి ఎలాంటి లాభం చేకూరలేదని, కేవలం కమిషన్ల కోసమే పనులు చేసి అర్ధాంతరంగా వదిలిపెట్టారని విమర్శించారు.

అలాంటి వారు నేడు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులకు బొక్కలు పెట్టి, “మేం నీరు తెచ్చాం, మీరు నీరు చర్చించాం” అని చెప్పడం సిగ్గుచేటని పేర్కొన్నారు. పదేళ్ల పాలనలో అభివృద్ధిని పట్టించుకోని వారు ఇప్పుడు విమర్శలు చేయడం తగదన్నారు.

నేడు ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తూ ప్రజల కలలను నెరవేర్చుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ కలిసికట్టుగా పని చేసి, పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరిని గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, పెద్దలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

మైనర్ బాలిక తల్లి బహిరంగ ప్రకటన ఇది….

Satyam News

బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

Satyam News

48 శాతం తగ్గిన సీజనల్ వ్యాధులు

Satyam News

విశాఖలో మంత్రి నారా లోకేష్ 78వ ప్రజాదర్బార్

Satyam News

అమెరికా యుద్ధ విమానాన్ని ధ్వంసం చేసిన ఇరాన్?

Satyam News

మిరాకిల్ చేద్దాం రండి అంటున్న హాట్ హీరోయిన్ హెబ్బా పటేల్

Satyam News

Leave a Comment