ముఖ్యంశాలుహోమ్

యోగాతో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత

#InternationalYogaDay

యోగా సాధన ద్వారా శారీరక దృఢత్వంతోపాటు మానసిక ప్రశాంతత మరియు ఆరోగ్యకర జీవనశైలి సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం(స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు)(ఎస్పిఎఫ్)డైరెక్టర్ జనరల్ డా.సియం.త్రివిక్రమ్ వర్మ పేర్కొన్నారు.

ఈనెల 21వతేదీ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం విజయవాడ ఇబ్రహీంపట్నంలోని డా.నార్ల తాతారావు ధర్మల్ పవర్ స్టేషన్(Dr.NTTPS)లో రాష్ట్ర ఎస్పిఎఫ్ పోలీస్ విభాగం ఆధ్వర్యంలో “యోగాంధ్ర” కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్ని ఎస్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ డా.సియం త్రివిక్రమ్ వర్మ మాట్లాడుతూ దైనందిన జీవితంలో పోలీసు సిబ్బంది ఎదుర్కునే మానసిక శారీరక ఒత్తిడిల నుండి ఉమశమనం పొందేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

కావున ప్రతి ఒక్కరూ ముఖ్యంగా పోలీస్ సిబ్బంది అంతా నిత్య జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకోవాలని సూచించారు.యోగా సాధనతో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం తోపాటు,ఫిట్ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు సహకారం అందించబడుతుందని డిజి త్రివిక్రమ్ వర్మ పేర్కొన్నారు.

అంతేగాక “యోగా  శారీరక,మానసిక ఆరోగ్యానికి బలమైన పునాది వంటిదని నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక మానసిక,శారీరకపరమైన ఒత్తుడుల నుండి ఉపశమనం పొందవచ్చని డా.త్రివిక్రమ్ వర్మ అన్నారు.కావున ప్రతి ఒక్కరూ యోగాను నిత్యజీవితంలో భాగంగా చేసుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని సూచించారు.

“యోగాంధ్ర” కార్యక్రమం ద్వారా ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకుని క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవడం మనందరి బాధ్యతని ఎస్పిఎఫ్ డిజి డా.త్రివిక్రమ్ వర్మ స్పష్టం చేశారు.ఈ యోగాంధ్ర కార్యక్రమంలో సుమారు 350 మందికి పైగా ఎస్పిఎఫ్ పోలీస్ సిబ్బంది, ఇతరులు ఉత్సాహంగా పాల్గొని వివిధ యోగాసనాలు, ప్రాణాయామాలు అభ్యసించారు.

ఎస్పిఎఫ్ జోనల్ కమాండెంట్ ముద్దాడ శంకర్ రావు మరియు డా.ఎన్టిటిపిఎస్  ఇబ్రహీంపట్నం అసిస్టెంట్ కమాండెంట్ టి.కృష్ణమాచారి వారి ఆధ్వర్యంలో ఈ“యోగా ఆంధ్ర” కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమానికి ఇన్స్పెక్టర్ జనరల్ B.V.రామి రెడ్డి,డాక్టర్ ఎన్ టి టి పి ఎస్ సిఇ శివ రామాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ సచివాలయం చీఫ్ సెక్యూరిటీ అధికారి P.V.S.N. మల్లికార్జున రావు,ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ అసిస్టెంట్ కమాండెంట్ కే. శ్రీనివాసులు,విజయవాడ గన్నవరం అంతర్జాతీ విమానాశ్రం అసిస్టెంట్ కమాండెంట్ ట్.కె రావు, విజయవాడ గార్డ్స్ అసిస్టెంట్ కమాండెంట్ పి.హేమసుందర రావు,యోగ గురువు లంకె జనార్దన్,ఇన్సపెక్టర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

హెరిటేజ్ పై తప్పుడు సమాచారం ఇచ్చిన బొత్స

Satyam News

ఒకప్పుడు శూన్యం… ఇప్పుడు పరిపూర్ణం

Satyam News

ఆసుపత్రిలో అనారోగ్యంతో ముద్రగడ…. పలకరించని జగన్…..!!

Satyam News

అల్పపీడన ప్రభావంతో రెండు రోజులు వర్షాలు

Satyam News

లోకేష్‌ మార్క్‌ పాలిటిక్స్‌.. జగన్ గజ గజ….

Satyam News

ఉత్తరకాశీ జలఉత్పాతానికి కారణం ఏమిటి?

Satyam News

Leave a Comment