మెదక్హోమ్

ప్రయివేటు హ్యాకర్లతో ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న రేవంత్ రెడ్డి

#HarishRao

సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌ను మాజీ మంత్రి హరీష్ రావు నేడు పరామర్శించారు. ఆయనతో పాటు మరో ఏడుగురు పార్టీ కార్యకర్తలను కూడా కలుసుకుని వారి పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

ఫేక్ పోస్టులు చేస్తున్న వారిపై ఆధారాలతో ఫిర్యాదు చేసిన క్రిశాంక్‌ను అరెస్ట్ చేయడం ప్రభుత్వ కక్ష సాధింపేనని హరీశ్ రావు ఆరోపించారు. తప్పు చేసిన వారిని వదిలేసి ఫిర్యాదు చేసిన వ్యక్తినే జైలుకు పంపడం దుర్మార్గమని విమర్శించారు. ప్రజా సమస్యలు, రైతుల ఇబ్బందులు, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులు, సిట్‌లు, కమిషన్ల ద్వారా అణచివేసే కుట్ర జరుగుతోందని అన్నారు.

ఎన్నికల ముందు ప్రజాస్వామ్యాన్ని హామీగా ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు నియంతలా వ్యవహరిస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. క్రిశాంక్‌పై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడంపై కోర్టు కూడా ప్రశ్నించిందని, ఇది ప్రభుత్వ కక్షసాధింపునకు నిదర్శనమని పేర్కొన్నారు. అంగన్వాడీ ఫోన్ల కుంభకోణం, టెన్త్ పేపర్ లీక్, హెచ్‌సీయూ భూముల వ్యవహారం వంటి అంశాలను ప్రస్తావిస్తూ, ప్రభుత్వ లోపాలను బయటపెట్టినందుకే క్రిశాంక్‌పై కేసులు పెట్టారని ఆరోపించారు.

కొంతమంది ఐపీఎస్ అధికారులు బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తీసుకొచ్చి కమాండ్ కంట్రోల్ రూమ్‌లో కూర్చోబెట్టి బీఆర్ఎస్ నేతల ఫోన్లు, ఇళ్ల ముందున్న సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారని హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. చట్ట విరుద్ధంగా వ్యవహరించే అధికారులను భవిష్యత్తులో వదిలిపెట్టబోమని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా విచారణ జరిపిస్తామని హెచ్చరించారు.

రైతుల సమస్యలపై కూడా హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు రోజుల తరబడి ఎదురుచూస్తున్నా ప్రభుత్వం స్పందించడంలేదని విమర్శించారు. మక్కలకు కొత్త పరిమితులు పెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదని అన్నారు. సన్న వడ్లకు బోనస్ ఇస్తారా లేదా సీఎం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

జూబ్లీహిల్స్‌లో ప్యాలెస్ నిర్మాణం, ప్రభుత్వ ఖర్చులపై కూడా విమర్శలు గుప్పించిన హరీశ్ రావు, ప్రజా సమస్యలను పక్కనపెట్టి ప్రభుత్వం ప్రాధాన్యతలు తప్పుదోవ పట్టాయని అన్నారు. అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, లేకపోతే బీఆర్ఎస్ పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Related posts

రైల్వే కోడూరు ఆర్యవైశ్య సంఘం కొత్త కమిటీ

Satyam News

మొంథా తుఫాన్ నేపథ్యంలో సహకరించండి

Satyam News

ఆర్టీసీ ఉద్యోగులకి ఏపీ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌

Satyam News

రూ. 84,000 కోట్ల పెట్టుబడులతో RMZ గ్రూప్‌

Satyam News

గణతంత్ర పెరేడ్ లో ‘ఆపరేషన్ సిందూర్’

Satyam News

తిరుమల శ్రీవారి పై కోపంతో కాశీబుగ్గ ఆలయ నిర్మాణం?

Satyam News

Leave a Comment