ప్రత్యేకంహోమ్

నీట్ గా లీక్ చేసిన లెక్చరర్లు: మరొకరు అరెస్టు

నీట్ (NEET UG) పరీక్షా పత్రాల లీకేజీ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వేళ, ఈ కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కుట్రలో సామాన్య వ్యక్తులు కాకుండా, స్వయంగా ప్రశ్నపత్రాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించాల్సిన ప్రొఫెసర్లే నిందితులుగా తేలడం విద్యార్థి లోకాన్ని విస్మయానికి గురిచేస్తోంది.

నిన్నటికి నిన్న కెమిస్ట్రీ ప్రొఫెసర్ కులకర్ణిని అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు, తాజాగా బోటనీ టీచర్ మనీషాను అరెస్ట్ చేశారు. వీరిద్దరూ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి, సబ్జెక్టుల వారీగా పని విభజన చేసుకుని మరీ ప్రశ్నపత్రాలను లీక్ చేసినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది.

సమాచార మార్పిడి కోసం వీరు టెలిగ్రామ్ యాప్‌ను ప్రధాన వేదికగా ఎంచుకున్నారని, గుట్టుచప్పుడు కాకుండా అభ్యర్థులకు ప్రశ్నలు చేరవేశారని అధికారులు గుర్తించారు. అయితే, పేపర్ లీక్ వ్యవహారం బయటకు పొక్కగానే అప్రమత్తమైన నిందితులు, ఆధారాలు దొరకకుండా ఉండేందుకు టెలిగ్రామ్ చాట్‌ను పూర్తిగా డిలీట్ చేసినట్లు సమాచారం.

ప్రస్తుతం సీబీఐ అధికారులు వీరి డిజిటల్ డేటాను రికవరీ చేసే పనిలో ఉన్నారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎంతమంది పెద్దల హస్తం ఉందనే కోణంలో విచారణ ముమ్మరంగా సాగుతోంది.

Related posts

ఆషాడ బోనాలకు బల్కంపేట ఎల్లమ్మ తల్లి సిద్ధం

Satyam News

చిన్నశేష వాహనసేవలో కనువిందు చేసిన  కళా వైభవం

Satyam News

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల?

Satyam News

గోడు వెళ్లబోసుకున్న ఆడబిడ్డలను కాపాడే బాధ్యత మాది

Satyam News

ట్రంప్ భార్యపై సినిమా: 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల

Satyam News

అమిత్‌ షాతో బాబు భేటీ…. వైసీపీలో మొదలైన టెన్షన్.!

Satyam News

Leave a Comment