ప్రత్యేకంహోమ్

ఇన్‌స్టా పెద్దాయనకు చంద్రబాబు భరోసా….. సిద్దాంతంలో ఇంటరెస్టింగ్‌ సీన్‌!

పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో సీఎం చంద్రబాబు నిర్వహించిన భారీ బహిరంగ సభ భూ రికార్డుల పంపిణీలో మైలురాయిగా నిలిచింది. మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా బ్లాక్‌చైన్ సాంకేతికత, క్యూఆర్ కోడ్‌తో రూపొందించిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను సీఎం రైతులకు పంపిణీ చేశారు. గత ప్రభుత్వాల తరహాలో నాయకుల బొమ్మలు లేకుండా, కేవలం అధికారిక రాజముద్రతో, రైతుల భూములకు పూర్తి రక్షణ కల్పించేలా వీటిని ముద్రించామని సీఎం స్పష్టం చేశారు. అవినీతికి తావులేకుండా పారదర్శకంగా భూ రికార్డుల వ్యవస్థను తీర్చిదిద్దామని, రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు.

అయితే ఈ అధికారిక పర్యటనలో అద్భుతమైన ఘట్టం చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇటీవల విపరీతంగా వైరల్ అయిన ఆచంట నియోజకవర్గం కామధేనువులంకకు చెందిన 96 ఏళ్ల సానబోయిన సత్యనారాయణ తాత కల ఈ సభలోనే నెరవేరింది. చంద్రబాబు సిద్ధాంతం వస్తున్నారని తెలిసి, ఆయన్ను ఒక్కసారైనా చూడాలంటూ వృద్ధాప్యంలోనూ ఉవ్విళ్లూరుతున్న సత్యనారాయణ తాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. దానిపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించి సిద్ధాంతంలో కలుస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సత్యనారాయణను తన బస్సులోకి ప్రత్యేకంగా పిలిపించుకున్న ముఖ్యమంత్రి, ఆయనతో పది నిమిషాలకు పైగా ఆప్యాయంగా ముచ్చటించారు. 96 ఏళ్ల వయసులోనూ ఇంకా సైకిల్ తొక్కుతానని, ఎలాంటి బీపీ, షుగర్ సమస్యలు లేవని పెద్దాయన చెప్పడంతో చంద్రబాబు ఆశ్చర్యపోయారు.

ఈ ఆత్మీయ భేటీలో ముఖ్యమంత్రి స్వయంగా స్పందిస్తూ..తాతా, నీకు వ్యక్తిగతంగా ఏం కావాలని అడిగినప్పుడు, ఆ వృద్ధుడు చూపిన నిస్వార్థానికి సీఎం చంద్రబాబు పూర్తిగా ఫిదా అయ్యారు. తన గురించి కాకుండా, మా ఊరిలో డ్రైనేజీ సరిగా లేదు, మంచి రోడ్డు వేయించండి బాబూ అంటూ ఊరి సమస్యలను ముందుంచారు. ఆపై వ్యక్తిగత విషయాల గురించి ఆరా తీయగా.. తాను ప్రస్తుతం ఒక చిన్న పాకలో ఉంటున్నానని, తన పెద్ద కుమారుడు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని సీఎం దృష్టికి తెచ్చారు.

సత్యనారాయణ తాత నిస్వార్థ గుణాన్ని మనసారా అభినందించిన చంద్రబాబు, ఊరి సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దాంతో పాటు వ్యక్తిగతంగా ఆ వృద్ధుడి కుటుంబానికి కొండంత అండగా నిలబడ్డారు. అనారోగ్యంతో ఉన్న ఆయన పెద్ద కుమారుడికి ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం చేయిస్తామని, అలాగే సత్యనారాయణ తాతకు రాబోయే నాలుగు నెలల్లోనే పక్కా ఇల్లు కట్టించి ఇవ్వాలని అక్కడే ఉన్న జిల్లా కలెక్టర్ నాగరాణిని చంద్రబాబు ఆదేశించారు. కలలో కూడా ముఖ్యమంత్రిని ఇంత దగ్గరగా కలుస్తానని అనుకోలేదని, తన కుటుంబంతో పాటు ఊరి సమస్యలను తీరుస్తామని సీఎం హామీ ఇవ్వడంపై సత్యనారాయణ తాత హర్షం వ్యక్తం చేశారు.

Related posts

హెరిటేజ్‌పై కుట్ర…. ఏపీ నుండి సీక్రెట్‌ ఆపరేషన్‌…!!

Satyam News

సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు పై కేసు నమోదు

Satyam News

ఐటీ పార్క్ నిర్మించాల్సిన చోట డంప్ యార్డా?

Satyam News

50 ఏళ్ల తర్వాత కలిసిన “లక్ష్మణరేఖ” జంట

Satyam News

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం

Satyam News

ఉజ్వల సంస్థ సునీతా కృష్ణన్ వివరించిన విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్‌‌

Satyam News

Leave a Comment