గుంటూరుహోమ్

స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై సమీక్షించిన ముఖ్య కార్యదర్శి

#Vishwanathan

రాజధాని పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై జి.ఎ.డి ముఖ్య కార్యదర్శి జె. శ్యామల రావు బుధవారం పెరేడ్ గ్రౌండ్స్ లో సమీక్షించారు.

పెరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న ఏర్పాట్లను సి.ఆర్.డి.ఏ కమిషనర్ విజయరామ రాజు, జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ, సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్.విశ్వనాథన్, పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్, సి.ఆర్.డి.ఏ అదనపు కమిషనర్ లు ఏ.భార్గవ తేజ, కొల్లాబత్తుల కార్తీక్, అభిషేక్ లతో కలసి పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, న్యాయాధికారులు, అఖిల భారత సర్వీసుల అధికారులు తదితరులు వచ్చే మార్గాలను, వారికి కేటాయించే స్థలాలను పరిశీలించారు.

స్వాతంత్య్ర దినోత్సవ ఆహ్వానాల ముద్రణ, పంపిణీపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పెరేడ్ ఏర్పాట్లు పక్కా ఉండాలని అన్నారు. వేల సంఖ్యలో సాధారణ ప్రజానీకం హాజరు అయ్యే అవకాశాలు ఉంటాయని, అందుకు తగిన విధంగా కూర్చునే ప్రదేశాలు, తాగు నీరు, మరుగుదొడ్లు వంటి సదుపాయాలు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పారు.

పార్కింగ్ ప్రదేశం, వాహనాల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ ప్లాన్ పక్కాగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ శాఖలు తమ ప్రగతిని ప్రదర్శించే శకటాలు తయారీ పూర్తి చేయాలని, 13వ తేదీన జరిగే తుది రిహార్సల్స్ లో పూర్తి స్థాయిలో ప్రదర్శన చూపాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, తెనాలి రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీరమణి, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఐ.కిషోర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయ లక్ష్మి, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి బి.వి.రంగా రావు, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ కె.కళ్యాణ చక్రవర్తి, విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ లు సి.హెచ్.రమేష్, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వి.విజయ లక్ష్మి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఇంకొద్ది సేపటిలో 4రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

Satyam News

ఓపెన్‌ఏఐ భారత్‌లో తొలి కార్యాలయం ఏర్పాటు

Satyam News

దేశం లో ఏకాకి అయిన వైసీపీ

Satyam News

గోదావరి పుష్కరాల నాటికి భద్రాద్రి వైభవం!

Satyam News

నిర్మాణ రంగా అభివృద్ధికి నైపుణ్యంతో కూడిన కార్మిక శక్తి

Satyam News

కోల్ కతా కాళీమాతను దర్శించుకున్న మంత్రి నారా లోకేష్

Satyam News

Leave a Comment