విశాఖపట్నంహోమ్

గిరిజన విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు మారికవలస సెంటర్

#MGowthamiIAS

రాష్ట్రంలోని గిరిజన విద్యార్థుల్లో ఉన్న అపారమైన ప్రతిభను వెలికితీసి, జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో వారు ఉత్తమ ర్యాంకులు సాధించేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ (COE)ను ఏర్పాటు చేసిందని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (APTWRES) కార్యదర్శి ఎం . గౌతమి తెలిపారు.

ఆదివారం ఉదయం విశాఖపట్నంలోని మారికవలస బాలుర గురుకుల పాఠశాల క్యాంపస్‌లోని ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను ఆమె సందర్శించి,క్లాస్ రూమ్ లను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గిరిజన గురుకులాల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు జాతీయ స్థాయి అర్హత పరీక్షలైన ఐఐటి – జెఇఇ, నీట్  వంటి పోటీ పరీక్షలకు అత్యున్నత శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు .

దీనిని అందరూ స్వాగతించాలన్నారు. బీసీ, సోషల్ వెల్ఫేర్ శాఖల తరహాలోనే గిరిజన సంక్షేమ శాఖకు కూడా ఈ అదనపు సీఓఈ (COE)ని మంజూరు చేసిందని తెలిపారు. పారదర్శకమైన ఆర్ ఎఫ్ పి ప్రక్రియ ద్వారా దేశంలోనే ప్రముఖ విద్యాసంస్థ అయిన ‘ఫిజిక్స్ వాలా’ ను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ సంస్థ నిపుణులైన అధ్యాపకులతో మన పిల్లలకు ఇంటెన్సివ్ కోచింగ్ అందిస్తుందని,దీనికి సంబంధించిన తరగతులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపారు.

ఉత్తరాంధ్ర ఏజెన్సీ మరియు మైదాన ప్రాంత విద్యార్థులకు రవాణా, ఇతర సదుపాయాల దృష్ట్యా విశాఖపట్నం ఎడ్యుకేషనల్ హబ్ కావడం వల్ల మారికవలసను ఎంచుకోవడం జరిగిందని, ఇక్కడ మెరిట్ ఆధారంగా ఎంపిక చేసిన 300 మంది బాలురు, 300 మంది బాలికలు (మొత్తం 600 మంది) ప్లస్ వన్, మరియు ప్లస్ టు విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో ఇంటెన్సివ్ ట్రైనింగ్ అందిస్తున్నామని తెలియజేసారు.

​మారికవలస స్కూల్‌లో ఇదివరకు ఉన్న పాఠశాల విద్యార్థులను పక్కనే ఉన్న గర్ల్స్ క్యాంపస్, కృష్ణాపురం, సబ్బవరం ఎస్ ఒ ఇ లకు మరియు వారి స్వంత ప్రాంతాల గురుకులాలకు (వారి అభ్యర్థన మేరకు) సురక్షితంగా బస్సుల్లో, ఉపాధ్యాయుల పర్యవేక్షణలో పంపడం జరిగిందన్నారు.

తల్లిదండ్రులకు ముందే అవగాహన కల్పించి, విద్యార్థులకు ఫేర్‌వెల్ ఇచ్చి ఎంతో జాగ్రత్తగా పంపించామని, రాత్రికి రాత్రే ఖాళీ చేశారనడంలో నిజం లేదని తెలియజేసారు. ఈఎంఆర్‌ఎస్ (EMRS) గురుకులాల తరహాలోనే విద్యార్థుల్లో భవిష్యత్ కార్పొరేట్ రంగానికి అనుగుణంగా ఆత్మవిశ్వాసం, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ పెంచేందుకు కో-ఎడ్యుకేషన్ విధానాన్ని అందిస్తున్నామని, అయితే  బాలికలు, బాలురకు వేర్వేరుగా డార్మిటరీలు, క్లాస్‌రూమ్‌లు, అదనపు సీసీటీవీ కెమెరాలు, ప్రత్యేక వార్డెన్లు, అదనపు సెక్యూరిటీని ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు.  ​

క్యాంపస్ లో ఉన్న విద్యార్థుల తో మాట్లాడారు. గిరిజన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఐఐటీ, నీట్ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించి తమ కుటుంబానికి, సమాజానికి మరియు రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కార్యదర్శి గౌతమి ఆకాంక్షించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ అప్పల రాజు పాల్గొన్నారు.

Related posts

అమెరికా నిర్ణయం పై అడ్డంతిరిగిన సౌదీ అరేబియా

Satyam News

సామాన్యుడి కోసం ఏఐ… అదే మన సూత్రం

Satyam News

మనమిత్ర లో శ్రీస్వామివారి స్పర్శదర్శనం టికెట్లు

Satyam News

మంత్రి కొండా సురేఖను కలిసిన శైలజా రామయ్యర్

Satyam News

ఓటర్ల జాబితా సవరణ పకడ్బందీగా నిర్వహించాలి

Satyam News

దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలు

Satyam News

Leave a Comment