33.5 C
Hyderabad
September 17, 2026
ప్రత్యేకంహోమ్

రష్యా చమురు కొనుగోలుపై ఆంక్షలు: ధిక్కరించిన భారత్?

#DonaldTrump

రష్యా, ఇరాన్ లపై ఆంక్షలు విధిస్తూ అమెరికా కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో భారత్ ధీటుగా స్పందించింది. రష్యా, ఇరాన్ లతో చమురు కొనుగోలు చేసే వారిపై 100 శాతం సుంకాలు విధించే అధికారాన్ని అమెరికా కాంగ్రెస్ అమెరికా అధ్యక్షుడికి కట్టబెడుతూ తీర్మానం ఆమోదించింది.

ప్రస్తుతం రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్నది. అమెరికా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంతో భారత్ పై అమెరికా 100 శాతం సుంకం విధించే అవకాశం కలుగుతుంది. అయితే దీనికి భారత్ చురుకుగా స్పందించడం చర్చనీయాంశం అయింది.

భారత ప్రజల ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకుని తాము నిర్ణయం తీసుకుంటామని, వేరెవరి వత్తిడికి లొంగేది లేదని భారత్ స్పష్టం చేసింది. ఈ పరిణామాల వల్ల ద్వైపాక్షిక సంబంధాలపై కలిగే ప్రభావాలను గత కొన్ని నెలలుగా అమెరికా ప్రభుత్వానికి ఉన్నతస్థాయిలో స్పష్టంగా తెలియజేస్తున్నామని భారత ప్రభుత్వం వెల్లడించింది.

రష్యా, ఇరాన్‌లపై ఆంక్షలకు సంబంధించిన లిండ్సే ఓ. గ్రాహం ఆంక్షల చట్టం–2026ను అమెరికా కాంగ్రెస్‌ గురువారం ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం రష్యా నుంచి ముడి చమురు, సహజ వాయువు కొనుగోలు చేసే దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గరిష్ఠంగా 100 శాతం వరకు సుంకాలు విధించే అధికారం పొందుతారు.

రష్యా ఇంధనాన్ని భారీగా కొనుగోలు చేస్తున్న భారత్‌, చైనా వంటి దేశాల ఎగుమతులపై ఈ నిబంధన ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఈ చట్టం ఆమోదమైన వెంటనే భారత్‌పై 100 శాతం సుంకం ఆటోమేటిక్‌గా అమల్లోకి రాదు. నిర్దిష్ట నిబంధనలు, పరిస్థితులు నెరవేరినప్పుడు సుంకాలు విధించే అధికారాన్ని మాత్రమే అమెరికా అధ్యక్షుడికి ఈ చట్టం కల్పిస్తుంది.

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. గత కొన్ని నెలలుగా అమెరికా ప్రతినిధులతో ఈ అంశంపై ఉన్నతస్థాయిలో చర్చలు జరిగాయని పేర్కొంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై తీసుకునే నిర్ణయాల ప్రభావం భారత్‌–అమెరికా ద్వైపాక్షిక సంబంధాలకే కాకుండా అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పైనా పడే అవకాశం ఉందని అమెరికాకు స్పష్టంగా తెలియజేసినట్లు వెల్లడించింది.

దేశంలోని 140 కోట్ల ప్రజలకు ఇంధన భద్రత కల్పించాల్సిన అవసరాన్ని ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని కొనసాగుతుందని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. వివిధ దేశాల నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేసే విధానాన్ని కొనసాగిస్తూ, మారుతున్న అంతర్జాతీయ మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపింది.

ఈ చట్టానికి అనుకూలంగా అమెరికా ప్రతినిధుల సభలో 262 ఓట్లు, వ్యతిరేకంగా 159 ఓట్లు వచ్చాయి. అంతకుముందు గత నెలలో సెనెట్‌ 86–11 ఓట్లతో దీనిని ఆమోదించింది. ఇప్పుడు ఈ చట్టం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పరిశీలనకు వెళ్లనుంది.

ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఆర్థిక ఒత్తిడిని పెంచడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశంగా ఉంది. రష్యా అధికార ప్రతినిధులు, ఆర్థిక సంస్థలు, ఇంధన రంగం, రష్యా చమురు రవాణాతో సంబంధం ఉన్న నౌకలపై చర్యలు తీసుకునే నిబంధనలు ఇందులో ఉన్నాయి. ఇరాన్‌కు సంబంధించిన ఆంక్షలను కూడా ఈ చట్టం విస్తరిస్తుంది.

భారత్‌కు అత్యంత కీలకమైన అంశం రష్యా ఇంధనాన్ని కొనుగోలు చేసే దేశాలపై అదనపు సుంకాలు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి కల్పించడమే. ఇప్పటికే రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో అమెరికా భారత్‌పై సుంకాలను ఉపయోగించి ఒత్తిడి తీసుకువచ్చిన నేపథ్యంలో తాజా పరిణామం రెండు దేశాల వాణిజ్య సంబంధాలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. ఈ అంశంపై దేశీయ వాణిజ్య, పారిశ్రామిక సంస్థలతో కలిసి పనిచేస్తామని తెలిపింది. అమెరికా చట్టం అమలు ప్రక్రియతో పాటు తదుపరి పరిణామాలను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందని వెల్లడించింది.

Related posts

చంద్రబాబు.. ది అన్‌స్టాపబుల్‌.. . దేశంలోనే టాప్‌ పారిశ్రామికవేత్త సంచలనం..!!

Satyam News

పేరుకే ఆసుపత్రి… వైద్యుడు ఉండడు

Satyam News

ఆదర్శ నియోజకవర్గంగా హుస్నాబాద్‌

Satyam News

అలీ లారిజానీ అంతిమ యాత్రలో కోట్లాది మంది….

Satyam News

మళ్ళీ “పెళ్లి చేసుకుందాం” అంటున్న విక్టరీ వెంకటేష్!

Satyam News

ఆన్ లైన్ బెట్టింగ్ యాప్: క్రికెటర్ల ఆస్తుల స్వాధీనం

Satyam News

Leave a Comment