26.7 C
Hyderabad
September 20, 2026
క్రీడలుహోమ్

ఆన్ లైన్ బెట్టింగ్ యాప్: క్రికెటర్ల ఆస్తుల స్వాధీనం

#SikharDhavan

ఆన్ లైన్ అక్రమ బెట్టింగ్ సైట్ లను ప్రోత్సహించి కోట్లాది రూపాయలు సంపాదించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో ప్రముఖ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధవన్ ల ఆస్తులను ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ అధికారులు (ఈడీ) స్వాధీనం చేసుకున్నారు. అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ వెబ్‌సైట్‌ “1xBet” కార్యకలాపాలకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.

మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధవన్‌ల ఆస్తులను ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకుంది. గురువారం విడుదల చేసిన సమాచారం ప్రకారం, మొత్తం రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద జారీ చేసిన తాత్కాలిక ఉత్తర్వు ప్రకారం, శిఖర్ ధవన్‌కి చెందిన రూ.4.5 కోట్ల విలువైన ఆస్తి, సురేష్ రైనా పేరపై ఉన్న రూ.6.64 కోట్ల మ్యూచువల్ ఫండ్‌ను స్వాధీనం చేసుకున్నారు.

విదేశీ సంస్థలతో 1xBet మరియు దానికి సంబంధించిన సంస్థలను ప్రమోట్ చేయడానికి ఈ ఇద్దరు క్రికెటర్లు “తెలిసే ఒప్పందాలు కుదుర్చుకున్నారని” ఈడీ దర్యాప్తులో తేలిందని అధికారులు వెల్లడించారు. ఈ కేసులో ఈడీ ఇప్పటికే రైనా, ధవన్‌లతో పాటు మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉప్పత్తా, నటులు సోనూ సూద్, ఉర్వశి రౌతేలా, మిమి చక్రవర్తి (మాజీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ) మరియు బెంగాలీ నటుడు అంకుష్ హజ్రాలను విచారించింది.

కురాకావోలో నమోదు చేసిన 1xBet సంస్థ తమను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బెట్టింగ్ సంస్థగా పేర్కొంటూ, 18 సంవత్సరాలుగా ఈ రంగంలో కొనసాగుతోందని తమ వెబ్‌సైట్‌లో వెల్లడించింది.

Related posts

కర్నూలు వ్యవసాయ మార్కెట్ నూతన పాలక మండలి

Satyam News

హోర్ముజ్ జలసంధిని తెరిచేశాం: డోనాల్డ్ ట్రంప్

Satyam News

పెళ్లైన 38 రోజులకే భర్తను చంపిన భార్య

Satyam News

తిరుపతిలో ఆరుగురిపై పిడి యాక్ట్

Satyam News

2025 కేలండర్‌ లో సగం కాలం విమానంలోనే…

Satyam News

అనుకూల తీర్పు రావాలంటే లంచం?

Satyam News

Leave a Comment