31.6 C
Hyderabad
September 21, 2026
హైదరాబాద్హోమ్

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు శుభవార్త

#IndirammaHoueses

ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించి, నిర్మాణంలో ఉన్న ఇళ్లకు నిధులు అందేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అనేక విజ్ఞప్తులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు సానుకూలంగా పరిగణనలోకి తీసుకుని, ఇప్పటికే నిర్మాణం ప్రారంభించిన లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా నిబంధనలను సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.

ఇందిరమ్మ ఇండ్ల పోర్టల్‌లో ఇప్పటికే మంజూరై బేస్‌మెంట్ లేదా అంతకంటే పై స్థాయికి చేరుకున్న  ఇళ్లకు L3 నుంచి L1 కేసులకు ఒకేసారి ప్రత్యేక అనుమతి  ఇస్తూ నిధుల విడుదలకు ప్రభుత్వం అనుమతించిందని తెలిపారు.  ఈ ప్రత్యేక సడలింపు ఒక్కసారి మాత్రమే వర్తిస్తుందని, భవిష్యత్తులో L3 మంజూరులకు దీనిని ప్రాతిపదికగా పరిగణించరాదని  స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వల్ల ఏర్పడే మొత్తం ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. అదేవిధంగా  ఇల్లు మంజూరైనప్పటికీ నిర్మాణం ప్రారంభం కాని వాటిని  రద్దు చేసి అర్హులైన వారికి కేటాయించాలని నిర్ణయించినట్లు  తెలిపారు.

Related posts

మార్వాడీ గో బ్యాక్ బంద్ పాక్షికం

Satyam News

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయండి

Satyam News

కూటమికి తిరుగులేదు జగన్ పార్టీకి బతుకులేదు

Satyam News

నత్త నడకన ఈ-సాక్ష్యం కేసుల అమ‌లు

Satyam News

పబ్లిక్ లోకి వచ్చిన స్మృతి మందానా

Satyam News

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరవింద్ కేజ్రీవాల్ నిర్దోషి

Satyam News

Leave a Comment