26.3 C
Hyderabad
September 27, 2026
ముఖ్యంశాలుహోమ్

ఆర్యదాన్ ముహమ్మద్ అవార్డు స్వీకరించిన రేవంత్

#Revanthreddy

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్-2026’ అవార్డును స్వీకరించారు. కేరళం రాష్ట్రంలోని నిలంబూర్‌లో ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ కేసీ వేణుగోపాల్ చేతుల మీదుగా ముఖ్యమంత్రి ఈ అవార్డును అందుకున్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఆర్యదాన్ ముహమ్మద్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు కేరళ వెలుపల నుంచి ఎంపికైన తొలి వ్యక్తిని కావడం మరింత గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.

“నేను కేరళం వచ్చిన ప్రతిసారీ ఎంతో ఆత్మీయ స్వాగతం లభించింది. రాహుల్ గాంధీ నాయకత్వంలో సాగిన భారత్ జోడో యాత్ర కోసం ఇక్కడికి వచ్చాను. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇక్కడికి వచ్చాను. కేరళం నాకు ఎంతో ఆత్మీయమైనది. కేరళం ప్రజలు లౌకికవాదానికి కట్టుబడి ఉన్నందుకు కృతజ్ఞతలు” అని పేర్కొన్నారు.

“ఆర్యదాన్ ముహమ్మద్ ఒక గొప్ప రాజకీయ నాయకుడు. ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించారు. పలువురు ముఖ్యమంత్రుల వద్ద నాలుగుసార్లు మంత్రిగా పనిచేశారు. కేరళం రాజకీయాల్లో ఆయన ఒక చాణక్యుడిలా ఉండేవారు” అని అన్నారు.

ఆర్యదాన్ ముహమ్మద్ నిలంబూర్‌లోనూ, కేరళంలోనూ కాంగ్రెస్ పార్టీకి ఒక మహావృక్షంలా ఉండేవారని గుర్తుచేశారు. ఆయన తన జీవితమంతా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడారని చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఆర్యదాన్ గారి స్ఫూర్తితో మనమంతా కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ చైర్మన్ ఆర్యదాన్ షౌకత్, కేరళం మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

రాష్ట్రపతి ఏడీసీగా నవ్య షెకావత్

Satyam News

యుకె బిజినెస్ ఫోరం రోడ్ షోలో మంత్రి లోకేష్ బిజీ

Satyam News

ఆన్‌లైన్‌లో మహానాడు: చంద్రబాబు సంచలన నిర్ణయం

Satyam News

మంత్రి నారా లోకేష్ సహకారంతో రంజాన్ తోఫా

Satyam News

గుట్టలు గుట్టలుగా రద్దయిన నోట్లు

Satyam News

అంబేద్కర్ కి అవమానం చేసిన వారిపై కఠిన చర్యలు

Satyam News

Leave a Comment