ప్రత్యేకంహోమ్

బాధ్యత నుంచి తప్పుకున్న భారత మహిళా క్రికెట్ సారధి

#harmanpreetkaur

సంచలన విజయాలు సాధించి భారత మహిళా క్రికెట్ ను ప్రపంచ స్థాయిలో చాటి చెప్పిన భారత మహిళా క్రికెట్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు. భారత మహిళల క్రికెట్ జట్టుకు సుదీర్ఘకాలం కెప్టెన్ గా హర్మన్‌ప్రీత్ కౌర్ కొనసాగారు.

గౌహతి లో భారత మహిళల క్రికెట్ జట్టు గత కొన్ని నెలల ప్రదర్శన, భవిష్యత్ ప్రణాళికలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం హర్మన్‌ప్రీత్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, ప్రధాన కోచ్ అమోల్ ముజుమ్దార్ హాజరయ్యారు.

37 ఏళ్ల హర్మన్‌ప్రీత్ కౌర్ దాదాపు దశాబ్ద కాలంగా భారత మహిళల టీ20 జట్టుకు నాయకత్వం వహించారు. 2016లో టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆమె, 2022లో వన్డే జట్టు కెప్టెన్‌గా నియమితులయ్యారు. 2023లో మూడు ఫార్మాట్లకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో భారత మహిళల క్రికెట్‌లో అత్యంత సుదీర్ఘకాలం నాయకత్వం వహించిన ఆటగాళ్లలో ఒకరిగా నిలిచారు.

కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న విషయాన్ని హర్మన్‌ప్రీత్ కౌర్ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. “ఈ రోజు భారత మహిళల క్రికెట్ జట్టు మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నాను. ఇది అంత సులభమైన నిర్ణయం కాదు. ఎన్నో సంవత్సరాల జ్ఞాపకాలు, భావోద్వేగాలు, త్యాగాలు, జీవితాంతం గుర్తుండిపోయే ఎన్నో సందర్భాలు ఈ బాధ్యతతో ముడిపడి ఉన్నాయి” అని ఆమె పేర్కొన్నారు.

హర్మన్‌ప్రీత్ నాయకత్వంలో భారత మహిళల క్రికెట్ జట్టు చారిత్రాత్మక విజయాలను సాధించింది. గత ఏడాది నవంబర్‌లో భారత మహిళల జట్టు తొలిసారిగా వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకోవడంలో ఆమె నాయకత్వం కీలక పాత్ర పోషించింది. ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో టీ20 ఫార్మాట్‌లో వరుసగా రెండోసారి స్వర్ణ పతకాన్ని సాధించిన భారత జట్టుకు కూడా ఆమె నాయకత్వం వహించారు.

Related posts

కూకట్ పల్లిలో దారుణం: లవ్ జిహాద్ తో మోసం

Satyam News

దర్శకుడు పి సి ఆదిత్య కు శ్రీకృష్ణదేవరాయలు స్మారక పురస్కారం

Satyam News

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు క్షేత్రస్థాయిలో ప్రణాళికలు

Satyam News

పొలాల్లో విష పురుగులు ఉంటాయి జాగ్రత్త !

Satyam News

గోదారోళ్ళ స్టైల్ అదిరింది గా…

Satyam News

విద్యుత్ వ్యవస్థ నిర్వహణలో ప్రభుత్వం విఫలం

Satyam News

Leave a Comment