ముఖ్యంశాలుహోమ్

రూ.20 వేల కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం

#SIPB

రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల ప్రోత్సాహానికి దూకుడు పెంచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో నేడు 13వ స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రొమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశం జరిగింది. రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక యూనిట్ల స్థాపనకు సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలను ఈ సమావేశంలో పరిశీలించారు.

దాదాపు 26 ప్రముఖ కంపెనీలు తీసుకొచ్చిన రూ.20 వేల కోట్లకు పైగా పెట్టుబడుల ప్రతిపాదనలపై బోర్డు చర్చించినట్లు అధికారులు తెలిపారు. ఎనర్జీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇండస్ట్రీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాల్లో భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నందున, ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలపడానికి ఎస్ఐపీబీ సిద్ధమైనట్లు సమాచారం.

ఇటీవల జరిగిన పెట్టుబడుల సదస్సులో ప్రభుత్వం కుదుర్చుకున్న పలు ముఖ్య ఒప్పందాల అమలుకు కూడా ఈ సమావేశంలో హరిత జెండా చూపే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. సమావేశానికి ప్రత్యక్షంగా హాజరైన మంత్రుల్లో నారా లోకేష్, టీజీ భరత్, పి. నారాయణ, కందుల దుర్గేష్, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ ఉన్నారు.

అదనంగా సీఎస్ విజయానంద్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, పయ్యావుల కేశవ్ వర్చువల్‌గా పాల్గొని ప్రతిపాదనలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. రాష్ట్ర పారిశ్రామిక పురోగతికి ఇవి కీలక నిర్ణయాలుగా నిలువనున్నాయని ప్రభుత్వం భావిస్తోంది.

Related posts

ఏరో డ్రోమ్ లైసెన్స్ మంజూరుతో భోగాపురం శత శాతం పూర్తి

Satyam News

ఫేక్ జీవో లతో ప్రభుత్వ భూమి కొట్టేసిన వైసీపీ లీడర్

Satyam News

తిరుమల ముంతాజ్ హోటల్ భూమి పై వాస్తవాలు ఇవి

Satyam News

చందాలు తీసుకోకుండా పార్టీ నడిపే ఏకైక వ్యక్తి పవన్ కల్యాణ్

Satyam News

అమెరికాకు హెచ్చరికలు జారీ చేసిన ఇరాన్

Satyam News

వెనిజులా అధ్యక్షుడి గురించిన ఆసక్తికర సమాచారం ఇది…

Satyam News

Leave a Comment