ప్రత్యేకంహోమ్

ఏపీ-తమిళనాడు ముఖ్యమంత్రులు చంద్రబాబు-విజయ్ భేటీ

#Vijay

విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మంగళవారం క్యాంప్ ఆఫీసుకు వచ్చిన సీఎం విజయ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ సాదరంగా స్వాగతం పలికారు.

అనంతరం ఇరువురు ముఖ్యమంత్రులు పలు అంశాలపై అధికారులతో కలిసి చర్చించారు. ప్రధానంగా గోదావరి-కావేరి నదుల అనుసంధానం ఆవశ్యకతను సీఎం చంద్రబాబు సమావేశంలో వివరించారు. నదుల అనుసంధానం కరువుకు శాశ్వత పరిష్కారంగా అభివర్ణించారు.

మరోవైపు తెలుగు గంగ ద్వారా చెన్నైకు మరింతగా తాగునీరు విడుదల చేయాలని సీఎం విజయ్ కోరారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో కృష్ణా జలాలు తగ్గడం, తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొన్నప్పటికీ చెన్నయ్ దాహార్తి తీర్చే విషయంలో ఏపీ ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ఇప్పటికే 4.08 టీఎంసీల నీటిని చెన్నై నగరానికి విడుదల చేసినట్టు సీఎం చంద్రబాబు చెప్పారు. నీటి లభ్యత, అవసరాలకు అనుగుణంగా మరికొంత నీటిని విడుదల చేయడంపైనా ఆలోచన చేస్తామని చెప్పారు.

Related posts

పిఠాపురం నుంచి వర్మ అవుట్..కమిటీకి కసరత్తు!

Satyam News

అయతొల్లా అలీ ఖమేనీ ని చంపేసిన అమెరికా

Satyam News

కుట్ర రాజకీయం చేస్తున్న నేరగాళ్లు

Satyam News

భారీగా పెరిగిన తిరుమల హుండీ ఆదాయం

Satyam News

ఇరాన్ రక్షణ వ్యవస్థ పై అమెరికా భీకర దాడులు

Satyam News

పర్యాటక ప్రదేశాలకు విస్తృత ప్రచారం

Satyam News

Leave a Comment