చిత్తూరుహోమ్

వైసీపీ గూండాల దాడిలో 30 మంది టీడీపీ నేతలకు రక్తగాయాలు

#Punganuru

వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గూండాలు దాడి చేయడంతో చిత్తూరు జిల్లా పుంగనూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదటి రోజు వైసీపీ దాడులతో రక్తసిక్తంగా మారింది. వైసీపీ చేసిన దాడులలో తెలుగుదేశం పార్టీకి చెందిన 30 మంది వరకూ కార్యకర్తలు నాయకులకు తీవ్ర రక్తగాయాలు అయ్యాయి. ఎంపి మిథున్ రెడ్డి కాన్వాయ్ వాహనంతో నామినేషన్లు వేసే కార్యాలయం గ్రౌండ్ లో భయానక వాతావరణం సృష్టించారు.

దాంతో తిరగబడ్డ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎదురుదాడులు చేశారు. ఈరోజు నామినేషన్ దాఖలు చేసేందుకు వైసీపీ నాయకులతో కలిసి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఎంపీని టీడీపీ కార్యకర్తలు లోనికి రాకుండా అడ్డుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై మిథున్ రెడ్డి వాహనాలు దూసుకెళ్లాయి. టీడీపీ కార్యకర్తపై ఎంపీ సహా వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో టీడీపీ కార్యకర్త మధుకు తీవ్రగాయాలయ్యాయి. ఈ దాడిలో పలువురికి గాయాలు కాగా, పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

మిథున్ రెడ్డి వాహనాలు టీడీపీ కార్యకర్తలపై దూసుకుపోవడంతో కోపోద్రిక్తులైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంపీ మిథున్ రెడ్డి వాహనాలపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. టీడీపీ నేత మధుసూదన్ రాయల్, సుహేల్ బాషా, ముల్లంగి రమణ, అసూరి బాలాజీ, సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశముండటంతో ఎస్పీ ధీరజ్ కొనుబిల్లి రంగంలోకి దిగారు.

పోలీసులతో స్వల్ప లాఠీఛార్జ్ చేయించి టీడీపీ కార్యకర్తలు, అభిమానులను, వైసీపీ నాయకులను పోలీసులు బయటకు పంపించారు. దీంతో నామినేషన్ ప్రక్రియ గొడవలు లేకుండా ప్రశాంతంగా సాగింది. ఎంపీ మిథున్ రెడ్డి నామినేషన్ కార్యాలయంలోనే ఉండటంతో బయట టీడీపీ శ్రేణులు గుంపులు గుంపులుగా ఆందోళనకు దిగారు. మిథున్ రెడ్డిని నామినేషన్ రూమ్ నుంచి బయటకు తీసుకెళ్లడానికి పోలీసులు యత్నించారు. ప్రస్తుతం పుంగనూరులో ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

Related posts

బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్ లు

Satyam News

ఇరాన్ పై మళ్లీ దాడి చేసిన అమెరికా

Satyam News

War Zone: ఇరాన్ దీవులపై అమెరికా దాడులు

Satyam News

ఆక్రమిత కాశ్మీర్ లో మళ్లీ ఉగ్రవాద శిబరాలు?

Satyam News

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి

Satyam News

సారిక వ‌ద్ద ప‌ది ఎక‌రాల్లో జిల్లా జైలు నిర్మాణం

Satyam News

Leave a Comment